ఐపీఎల్ 2022 సీజన్ లో 2 కొత్త జట్ల ఎంట్రీ ఇవ్వడంతో.. మొత్తం జట్ల సంఖ్య 10కి చేరిందని అందరూ ఎంతో సంబరపడ్డారు. ఇక బోలెడన్ని మ్యాచులు, చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నారు. కానీ, అందరి ఆశలు.. అడియాశలయ్యాయి. రెండు అగ్రశేణి జట్లు(చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్) దారుణంగా విఫలమవుతున్నాయి. మరోవైపు దిగ్గజ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. కనీసం, 10 బాల్స్ ఆడేవరకు క్రీజులో నిల్చోలేకపోతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారో.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇద్దరు గొప్ప ఆటగాళ్లే. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటున్నారంటే భారీ ఇన్నింగ్సులు రావాల్సిందే. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పరుగులు చేయడానికి నానాతంటాలు పడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో అడపాదడపా రాణిస్తున్నా.. ఐపీఎల్ 2022 మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. ఒకవైపు యువ క్రికెటర్లుభారీ ఇన్నింగ్సులతో అదరగొడుతుంటే.. వీరు మాత్రం.. సింగల్ డిజిట్ లకే వెనుదిరుగుతున్నారు. ఈ సీజన్ లో రోహిత్ శర్మ 7 మ్యాచులు ఆడి 114 పరుగులు చేయగా.. హైయెస్ట్ స్కోర్ 41. ఇక.. విరాట్ కోహ్లీ 7 మ్యాచుల్లో 119 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్ 48 పరుగులు. ఒకరికొకరు ఏ మాత్రం తగ్గట్లేరు.
Those who trolled Kohli for duck… Today Rohit got out for duck… As i previously said- remove them from t20 wc team ASAP…🙌🏻 pic.twitter.com/nDHKNXEapf
— Melon Lusk (@kohlifanboy) April 21, 2022
ఇది కూడా చదవండి: ముంబైకి భారంగా మారిన రోహిత్, ఇషన్ కిషన్! ఇక వీళ్లు ఆడరా?
విరాట్ కోహ్లీ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన తన చివరి మ్యాచులో మొదటి బాల్ కే డకౌట్ అయ్యాడు. ఇక.. రోహిత్ శర్మ చెన్నైతో జరిగిన మ్యాచులో రెండు బాల్స్ ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో మీమెర్స్ చేలరేగిపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. డకౌట్లపై ఫ్యాన్స్ సెటైరికల్ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. “నువ్ ఫస్ట్ బాల్ కే డక్! కోహ్లీ.. నేను రెండు బాల్స్ ఆడానుగా..! అని రోహిత్ చెబుతున్నట్లుగా క్రియేట్ చేసిన మీమ్స్ తెగ వైరలవుతున్నాయి. ఫామ్ లేక సతమతమవుతున్న రోహిత్, విరాట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli out on golden duck sad to see the way he struggling 😭
#ViratKohli #RCBvsLSG #goldenduck pic.twitter.com/RiRr771onD— Trending Cric Zone (@NaitikSingh28) April 19, 2022
Rohit Sharma out on a duck 😭😭😭😭😭💔💔💔😱😱😱😱 #MIvsCSK #RohitSharma #IPL2022 #TATAIPL pic.twitter.com/eQwi10RzRP
— Rutvik (@RO45rs) April 21, 2022
Virat and Rohit both got out on duck. pic.twitter.com/IJJ5kBQCMc
— lol hi (@urgwhatevdude) April 21, 2022
ఇది కూడా చదవండి: కెప్టెన్ గా రోహిత్ అట్టర్ ప్లాప్! కోహ్లీని తిట్టిన వారు ఇప్పుడు ఎక్కడ?