ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న నోబాల్ వివాదంపై ఐపీఎల్ కమిటీ సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో ఈ గొడవ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్నందున.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజ్‌లో వంద శాతం కోత విధించింది. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. పంత్ క్రీజ్‌లోని ఆటగాళ్లను బయటికి పిలిపించే ప్రయత్నం చేయడం.. మ్యాచ్ మధ్యలో ఒక వ్యక్తిని గ్రౌండ్‌లోకి పంపడంతో పంత్‌పై ఈ విధమైన చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటన మరలా పునరావృతం అయితే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమచారం.
కాగా.. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఢిల్లీకి విజయం కోసం 36 పరుగులు అవసరం అయ్యాయి. ఆ ఓవర్ మెకాయ్ వేయగా.. తొలి మూడు బంతులను ఢిల్లీ ఆల్‌రౌండర్ రోవ్‌మెన్ పావెల్ సిక్సులుగా మలిచాడు. మూడో బంతి ఫుల్ టాస్‌గా వచ్చింది. అది బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. డగౌట్లో కూర్చున్న ఢిల్లీ టీం అది నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు. అలాగే పావెల్ సైతం అంపైర్ వద్దకు వెళ్లి.. నా నడుము కంటే ఎత్తులో వచ్చింది అది కంప్లీట్ నోబాల్.. మీరు నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్‌తో వాదించాడు. కానీ నితిన్ మీనన్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. అది ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు.దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి సైగచేశాడు. పావెల్, కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇంతలో షేన్ వాట్సన్ పంత్‌ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. అప్పటికే తన లయ దెబ్బతిన్న పావెల్ తర్వాతి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టలేదు. ఆఖరి బంతికి ఔటయిపోయాడు. దీంతో రాజస్థాన్ గెలిచింది. కానీ.. పంత్ ప్రవర్తనపై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి.. దానిపై పంత్ తప్పైందని విరవణ కూడా ఇచ్చాడు. అయినా కూడా కోచ్ ఆఫ్ కండక్ట్ కింద పంత్‌కు జరిమానా పడింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంత్ చేసింది తప్పే! కానీ.. ఈ చెత్త అంపైరింగ్ ఏంటి?
Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.