పృథ్వీ షా.. ఈ యువ క్రికెటర్ గురుంచి ఎంత చెప్పినా తక్కువే. ఆడితే బీభత్సం.. ఆడకపోతే డకౌట్. ఇదే పృథ్వీ షా ఆటతీరు. ఇదంతా ఆట లేకపోవడం వల్లనా అంటే.. కాదు.. లేజీనెస్. పృథ్వీ షా ఆట తీరు అచ్చం సెహ్వాగ్ లా ఉంటుది. ప్రతి బంతిని బౌండరీ కొట్టాలనుకుంటాడు. ఈ ఆటతీరే.. ఈ చిచ్చర పిడుగులో అందరకి నచ్చేది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సమర్థుడు. ఈ యువ క్రికెటర్ ఆటకు.. కాస్త ఆత్మవిశ్వాసం తోడైతే తిరుగుండదు. ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న పృథ్వీ షా.. తొలి రెండు మ్యాచులలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా తర్వాత మాత్రం ఇరగదీస్తున్నాడు.
38 పరుగులు(24 బంతుల్లో, 4*4, 6*2), 10 పరుగులు(7 బంతుల్లో, 6*1), 61 పరుగులు(34 బంతుల్లో, 4*9, 6*2), 51 పరుగులు(29 బంతుల్లో, 4*7, 6*2).. ఇవి ప్రస్తుత సీజన్ లో పృథ్వీ షా చేసిన స్కోర్లు. చూశారుగా.. చివరి రెండు మ్యాచుల్లో ఎలా ఇరగదీశాడో. బాగా ఆడితే ఇలా ఉంటుంది.. బౌలర్లకు పగలే చుక్కలు కనిపిస్తాయి. అయితే,.. తొలి రెండు మ్యాచులలో విఫలమైన షా ను హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వారం రోజుల క్రితం తన గదికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడాడట. ఈ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడు. పాంటింగ్ ఏం మాట్లాడో ఏమో గానీ.. మీటింగ్ అనంతరం పృథ్వీ షా మాత్రం పూనకం వచ్చినోడిలా చెలరేగిపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్ తో జరిగిన మ్యాచుల్లో మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు.
Shaw at his best 🙌
Top-notch performance from @PrithviShaw last night in what was a Powerful Powerplay 💪#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals | #LSGvDC pic.twitter.com/HeUyQNO2Up
— Delhi Capitals (@DelhiCapitals) April 8, 2022
Well played Prithvi Shaw 👏#IPL #IPL2022 #TATAIPL #KKRvDC #DCvKKR #PrithviShaw pic.twitter.com/Dgp0gMrwdC
— CricBouncer (@Cricket_Bouncer) April 10, 2022
ఇది కూడా చదవండి: SRH వరుస విజయాలు! కావ్య పాపపై ఐరెన్ లెగ్ ముద్ర!
ఈ క్రమంలో పాంటింగ్.. ఈ యువ క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ తరఫున షా వంద టెస్టులు ఆడతాడని, దేశం గర్వించదగ్గ ఆటగాడు అవుతాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. “నేను పృథ్వీ ఆటను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. అతడిలో ఎంతో ప్రతిభ దాగుంది. భవిష్యత్తులో అతడు టీమిండియా తరఫున కచ్చితంగా వంద టెస్టులు ఆడిన ఆటగాడిగా నేను చూడాలనుకుంటున్నాను. అంతేకాదు.. దేశం తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచుల్లో అతడు ఆడాలని నేను కోరుకుంటున్నాను” అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
.@RickyPonting wants to take @PrithviShaw to 𝙄𝙣𝙛𝙞𝙣𝙞𝙩𝙮 𝙖𝙣𝙙 𝘽𝙚𝙮𝙤𝙣𝙙 🚀🔥#YehHaiNayiDilli | #IPL2022 | @TajMahalMumbai | #TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/d2EK7ATtkH
— Delhi Capitals (@DelhiCapitals) April 12, 2022
మొత్తంగా ఈ సీజన్ లో నాలుగు మ్యాచులు ఆడిన పృథ్వీ షా 160 పరుగులు చేశాడు. పవర్ ప్లే లో హిట్టింగ్ కు దిగి ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ యువ ఓపెనర్.. ఇటీవల కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి పవర్ ప్లే లో తక్కువ ఇన్నింగ్స్ (57 ఇన్నింగ్స్) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో కెఎల్ రాహుల్ (56 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ యువ క్రికెటర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
𝘈𝘯𝘺 𝘉𝘰𝘥𝘺 𝘊𝘢𝘯 𝘋𝘢𝘯𝘤𝘦 at DC shoots 🕺🏻🤩#YehHaiNayiDilli | #IPL2022 | @akshar2026 | @PrithviShaw | @PDdancing | @TajMahalMumbai | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals | #DCAllAccess | #OctaRoarsForDC pic.twitter.com/15qsLzREZR
— Delhi Capitals (@DelhiCapitals) April 4, 2022
Highest strike rate in Powerplay in IPL history :-
(Min 1000 runs)
Prithvi Shaw : 148.69
Virender Sehwag : 143.85
David Warner : 135.89
Chris Gayle : 134.17
Adam Gilchrist : 134.07
Suresh Raina : 132.70
Faf du Plessis : 129.93
Quinton de Kock : 129.49#CricketStats #IPL2022— Cricket StatsMan (@CricketStats47) April 10, 2022
ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యాపై పందెం కాసి అడ్డంగా బుక్కైన అభిమాని