‘సన్ రైజర్స్ హైదరాబాద్‘.. చూశారుగా పలకడానికి ఎంత వినసొంపుగా ఉందో. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో హీరోయిన్ పలుకుంతుంటది.. ‘గుడ్ మార్నింగ్ హైదరాబాద్‘ అని అప్పుడు వినడానికి ఎంత బాగుంటదో.. ఐపీఎల్ లో మన తెలుగు జట్టైనా.. ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ పేరు కూడా చాలా మధురంగా ఉంటుంది. తెలుగు అభిమానులకు ఎస్ఆర్హెచ్ అంటే అమితమైన ప్రేమ. సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది అంటే.. తాము విజయం సాధించినతగా గర్వ పడతారు. ఐపీఎల్ 2022లో మన తెలుగు జట్టైనా ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ఓటమితో సీజన్ ను ఆరంభించినా.. పుంజుకొని వరుస విజయాలతో దూసుకుపోతోంది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో 14 మ్యాచులాడిన సన్ రైజర్స్.. 3 విజయాలు, 11 ఓటములతో పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున నిలిచింది. పోనీ ఈ ఏడాదైనా బాగా రాణిస్తారు అనుకుంటే.. 2022 సీజన్ లో మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి. ఈ వరుస అపజయాలు చూశాక సగటు అభిమానిగా ఎవరైనా అనే ఒకే మాట.. వీరు మారరు.. వీరి ఆటే ఇంత. కానీ.. అభిమానుల అంచనాలను తలక్రిందలు చేస్తూ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది.
ఇది కూడా చదవండి: వీడియో: ఉమ్రాన్ మాలిక్ సూపర్ యార్కర్! డగౌట్‌లో స్టెయిన్ సంబరాలు!
మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఏకంగా 61 పరుగుల తేడాతో ఓడిపోయిన హైదరాబాద్.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోనూ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టి గెలుపు రుచి చూసిన సన్‌రైజర్స్ టీమ్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అలవోకగా గెలుపొందింది. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేదనకు దిగే హైదరాబాద్ టీమ్ విజయం సాధించడం గమనార్హం. అది కూడా కేవలం 2-3 వికెట్లని మాత్రమే చేజార్చుకుని లక్ష్యాల్ని ఛేదించేస్తుండటం టీమ్ జోరుకి నిదర్శనం.
Hat-trick of wins, hat-trick of cake smashes 😅🎂#SRHvKKR #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/2HRBgg7nV4
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2022
నమ్మకాన్ని వమ్ము చేయకుండా..
మొదటి రెండు మ్యాచుల్లో సన్ రైజర్స్ ఓటమి తరువాత.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి విజయాల ఖాతా తెరిచింది. అయితే ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ రాలేదు. వ్యక్తిగత కారణాలో మరేదో తెలియదు కానీ ఆమె హాజరు కాలేదు. మెగా వేలంలో సరైన టీమ్ తీసుకోలేదని ఆమెపై గుర్రుగా ఉన్న అభిమానులు.. కావ్య గైర్హాజరీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో ఆమెది ఐరన్ లెగ్ అని, మ్యాచ్‌కు రావద్దని ప్రచారం చేశారు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కావ్య మారన్ హాజరైంది. గ్యాలరీలో తన హవాభావాలతో అభిమానులను కట్టిపడేసింది. ఆమె నవ్వులు.. విచారంగా ఉండట్టాన్ని కెమెరామెన్ పదే పదే చూపించాడు. సన్‌రైజర్స్ విజయంతో.. ఆమె ముఖంలో చిరునవ్వులు చిందించాయి. దాంతో కావ్య యాంటీ ఫ్యాన్స్‌పై ఆమె సపోర్టర్స్ ఎదురు దాడికి దిగారు. ఎవడ్రా కావ్య పాప వస్తే మ్యాచ్ గెలవదన్నదని ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు.
Maa Kavya papa bangaaram ra 🧡
Auction lo icchipadesindi 😘 pic.twitter.com/NPkzUCc7JC— Dracarys. (@_Dragonbeast) April 15, 2022
మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకం .. జట్టులో మార్పులు..
మొదటి రెండు మ్యాచుల్లో.. అబ్దుల్ సమాద్, రోమారియో వంటి ఆటగాళ్లపై నమ్మకముంచి జట్టులో చోటు కల్పించింది. కానీ.. వారు సరిగా రాణించడం కాదు కదా.. గెలవాలనే పట్టుదల కూడా కూడా వారిలో కనిపించలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్ నుండి వారిని కూర్చోబెట్టి శశాంక్ సింగ్, మార్కో జెన్ సెన్, జగదీశ్ సుచిత్.. వంటి యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. చెన్నైతో జరిగిన మ్యాచులో.. యువ ఆటగాడు అభిషేక్ శర్మ(50 బంతుల్లో 75 పరుగులు, 5 పొర్లు, 3 సిక్సులు) ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ఇక గుజరాత్ తో జరిగిన మ్యాచులో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. 163 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఇక కోలకతా నైట్ రైడర్స్ తో నిన్న జరిగిన మ్యాచులో.. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ బౌండరీలతో చెలరేగిపోయారు. మొదటి రెండు మ్యాచుల్లో రాణించకపోయినా.. ఆటగాళ్లపై మేనేజ్ మెంట్ పెట్టుకున్న నమ్మకమే.. ఈ విజయాలకు మొదటి కారణం. ప్రతి మ్యాచులో అదే ఆటగాళ్లని కొనసాగించకుండా.. సరైన టైం లో జట్టులో మార్పులు చేయడం రెండవ కారణం.
An intimidating spell, which deserved the #Riser of the Day award. 👏
Well done, Umran Malik 🧡#SRHvKKR #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/141t2jRpRb
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2022
ఇది కూడా చదవండి: SRH హ్యాట్రిక్ విక్టరీ! నవ్వులు చిందించిన కావ్య పాప
సన్ రైజర్స్ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కూడా నెటిజన్లు కొనియాడుతున్నారు. మీరు మారిపోయారు సర్ అంటూ సెల్యూట్ చేసే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది, తగ్గేదేలే.. అట్లుంటది మనతోనే అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్న మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక కావ్య పాప ముఖంలోని చిరునవ్వులు.. గ్లో తమకు చాలా సంతోషాన్నిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ విజయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిజేయండి.
Evadra papa vaste win navvadu ani cheppindi kavya papa mana lucky charm pic.twitter.com/XK3sR6sb0b
— Venkat sharma (@venkat020202) April 15, 2022
Win 🥳🥳 @SunRisers#KavyaMaran #SRHvsKKR #OrangeArmy #SRH #IPL2022 pic.twitter.com/GDmJluUDJu
— Kaasu Venum (@KaasuVenum) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.