క్రికెట్ హంగామా ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమైన రెండో రోజే 14 సీజన్లలో కనివిని ఎరుగని ఒక చెత్త రికార్డు క్రియేట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ చెత్త రికార్డుకు వేదికైంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అందులో 23 అదనపు పరుగులు ఉన్నాయి. పంజాబ్ బౌలర్లు చాలా ధారళంగా పరుగులు ఇచ్చారు. ఇంత భారీ స్కోర్‌తో మ్యాచ్‌పై ఆశలు పెట్టుకున్న ఆర్సీబీ మ్యాచ్ తమదే అనే ధీమాలో లక్ష్యాన్ని కాపాడుకునే బరిలోకి దిగింది. కానీ పంజాబ్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డంతో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది పంజాబ్.
కాగా అదనపు పరుగుల విషయంలో మాత్రం పంజాబ్‌కు ఏమాత్రం తీసిపోలేదు ఆర్సీబీ. వాళ్లు కూడా 22 పరుగులు అదనంగా ఇచ్చారు. పంజాబ్ లక్ష్య ఛేదనలో ఈ అదనపు పరుగులు కూడా కీలకంగా మారాయి. ఇలా రెండు జట్లు పోటీ పడి మరి ఎక్స్‌ట్రా రన్స్ కుమ్మరించాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 45 పరుగులు అదనంగా వచ్చినవే. ఇప్పటి వరకు జరిగిన 14 ఐపీఎల్ సీజన్లలో ఇన్ని అదనపు పరుగులు ఎప్పుడూ రాలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఎక్స్‌ట్రా రన్స్ వచ్చిన మ్యాచ్‌గా నిలిచింది. మరి ఈ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కేఎల్ రాహుల్ చేసిన ఘోర తప్పిదమే లక్నో ఓటమికి కారణమైందా?
@gujarat_titans pic.twitter.com/SS0BYzdr5h
— Sayyad Nag Pasha (@PashaNag) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.