‘ఈ సాలా కప్ నామ్దే’.. ఈ స్లొగన్ చూడగానే వెంటనే గుర్తొచ్చే జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ). ప్రతియేటా ఇదే స్లోగన్ తో.. టైటిల్ మాదే అంటూ అడుగుపెట్టే ఆర్సీబీ.. ఆ కోరిక నెరవేరకుండానే వెనకడుగు వేస్తూనే ఉంది. ఇదిగో.. అదే ఆట తీరును మరోసారి కొనసాగించారు. ప్రత్యర్థుల ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచి కూడా దాన్ని కాపాడుకోలేక ఓటమి పాలయ్యింది. అయితే,.. ఈ మ్యాచుతో కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్ మాత్రం అందరని ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు అనుజ్ రావత్, ఫాఫ్ డుప్లిసెస్ శుభారంభాన్ని అందించారు. 21 పరుగులు చేసిన అనుజ్ రావత్ (2 ఫోర్లు, ఒక సిక్సు)ను రాహుల్ చాహర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో జత కట్టాడు. ఇద్దరు కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 61 బంతుల్లోనే 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డుప్లిసెస్ ఓ దశలో సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ 88 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో షారూక్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అయితే.. ఈ మ్యాచులో డుప్లెసిస్ ఆడిన తీరు.. ఆర్సీబీ మాజీ క్రికెటర్ డివిలియర్స్ ని గుర్తు చేసింది. కోహ్లీ, డివిలియర్స్ ఆర్సీబీ జట్టుకు ఎన్నో కీలక భాగస్వామ్యాలు అందించారు. వీరి మధ్య అనుబంధం, చిరునవ్వు అందరికి దూరమయ్యిందే అన్న ఆలోచన మొన్నటిదాకా అందరకి ఉండేది. కానీ, నిన్నటి మ్యాచుతో ఆ అనుబంధాన్ని కొనసాగించడానికి నేనున్నాను అని మరో సౌతాఫ్రికా క్రికెటర్ ముందుకొచ్చినట్లు కనపడుతోంది. ఆటలో గెలుపోటములు సహజం. కానీ అనుబంధం, ఆప్యాయత అనేది ఆటలో ఉండాల్సిన మరో మంచి లక్షణం అంటున్నారు వీరిద్దరి బాండింగ్ చేసిన అభిమానులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Same Vibes 🤩❤️@RCBTweets • @imVkohli • @ABdeVilliers17 • @faf1307 • #RCB pic.twitter.com/YQ1OOhNZ6n
— Virat Kohli Trends™ (@TrendVirat) March 27, 2022
మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డుప్లెసిస్ (57 బంతుల్లో 88, 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి(29 బంతుల్లో 41, 2 సిక్సర్లు, ఒక ఫోర్), కార్తిక్( 14 బంతుల్లో 32, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపారు. ఆర్‌సీబీ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం.. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 43, బానుక రాజపక్స 43, మయాంక్ అగర్వాల్ 32 పరుగులతో రాణించగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ 24 నాటౌట్, ఓడియన్ స్మిత్ 25 నాటౌట్ లాంచనాన్ని పూర్తి చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
Same story, different players @faf1307 & @ABdeVilliers17 🔥
Also, the king is back @imVkohli !👏🏻
And, @DineshKarthik ⚡️#RCBvPBKS #rcb #royalchallengersbangalore #IPL2022 #CSK𓃬 #ViratKohli𓃵 #FafDuPlessis #abdevilliers #TataIPL2022 pic.twitter.com/XEbGqdGSWM— Harini Mehta (@harinimehta13) March 27, 2022
We knew, we had seen this before! 🤗💯
AB de Villiers x Virat Kohli x Faf du Plessis 🔥#RCB12thManArmy #PlayBold #RCB #IPL2022 #TATAIPL #ನಮ್ಮRCB #PBKSvRCB pic.twitter.com/J8zjSCHFgU
— RCB 12th Man Army (@rcbfansofficial) March 27, 2022