ఐపీఎల్ 2022లో ఆర్సీబీ మరో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 నాటౌట్), షెబాజ్ అహ్మద్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) విరోచిత బ్యాటింగ్‌తో ఆర్సీబీకి విజయాన్ని అందించారు. స్లో వికెట్‌పై టాస్ గెలవడం ఆర్సీబీకి కలిసిరాగా.. ఊహించినట్లుగానే మైదానంలో కురిసిని విపరీతమైన తేమ రాజస్థాన్ రాయల్స్‌కు తీరని నష్టం చేసింది. డ్యూ ఉన్నా.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్.. ఆర్సీబీకి మ్యాచ్ దూరం చేసేలా కనిపించాడు.
సూపర్ బాల్‌తో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 29)ను క్యాచ్ ఔట్ చేసిన చాహల్.. తన మరుసటి ఓవర్‌లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ముందుగా విరాట్ కోహ్లీ(5)ని రనౌట్ చేసి ఆ మరుసటి బంతికే డేవిడ్ విల్లే(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే షెఫెర్డ్ రూథర్‌ఫోర్డ్(5) కూడా ఔటవ్వడంతో ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. చాహల్(2/14)తన డెడ్లీ స్పెల్‌తో బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహల్.. 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆర్సీబీ ఓటమి ఖాయమని అంతా భావించారు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కూడా ఇదే అనుకున్నారు. చాహల్ దెబ్బకు 87/5తో ఓటమి అంచున చేరిన ఆర్సీబీకి.. మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్ ప్రాణం పోసింది.అప్పుడే క్రీజులోకి వచ్చిన కార్తీక్.. ఆ ఓవర్ మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీకి తరలించాడు. అయితే అది నో బాల్ కావడంతో మరుసటి బంతి ఫ్రీ హిట్ కావడంతో స్వేచ్చగా సిక్స్ బాదాడు. ఆ తర్వాత చివరి రెండు బంతులు కూడా బౌండరీలకు తరలించాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ ఆర్సీబీ వైపు తిరిగింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్‌లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఆర్సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43 నాటౌట్), షెబాజ్ అహ్మద్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) అద్భుత బ్యాటింగ్‌తో ఆర్సీబీకి రెండో విజయం అందించారు.
ఇదీ చదవండి: ధోనీపై మహ్మద్ కైఫ్ ప్రశంసలు!
WE NEVER GIVE UP! 🤜🏻🤛🏻
✌🏻 points in the bag. 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RRvRCB pic.twitter.com/koJmR7r0cH
— Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.