ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఒకటి. ఈ జట్టు ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. గతేడాది ఛాంపియన్స్ గా నిలిచిన సీఎస్కే.. ఐపీఎల్ 2022 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగింది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా.. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ దారుణంగా ఓడింది. ఇంతటి దారుణమైన పరిస్థితికి ఆ జట్టు కెప్టెన్సీలో మార్పే కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి సీఎస్కే కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోని కొనసాగుతున్నాడు. కానీ అనూహ్యంగా ఐపీఎల్ 2022 సీజన్‌కు రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిజానికి సీఎస్కే మేనేజ్‌మెంట్ కెప్టెన్‌గా ధోని ఉన్నాడనే నమ్మకంతోనే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో భవిష్యత్తు కెప్టెన్ గురించి ఆలోచించలేదు. బ్యాటర్‌గా అంత గొప్ప ప్రదర్శనలు ధోని ఇవ్వకున్నా.. కెప్టెన్సీతో జట్టును నడిపిస్తాడనే ఉద్దేశంతోనే ధోనిని సీఎస్కే రిటేన్ చేసుకుంది. కానీ, ధోనీ.. లీగ్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకొని మేనేజ్‌మెంట్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో సీఎస్కే యాజమాన్యం.. ఆ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
ఇది కూడా చదవండి: IPL-2022: ముంబై, చెన్నై ఖాతాల్లోకి నాలుగో ఓటమి.. తలలు పట్టుకుంటున్న ఫ్యాన్స్!
ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. జట్టులో ఉన్నాడుగా, సలహాలు ఇస్తూ జట్టును నడిపిస్తాడని అందరూ భావించారు. కానీ కెప్టెన్‌గా జడేజా దారుణంగా విఫలమవుతున్నాడు. ధోని సలహాలు కూడా వర్కౌట్ కావడం లేదు. దీంతో.. సీఎస్కే మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ మార్పుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు కూడా సీఎస్కే కెప్టెన్సీ మార్పు వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటేన్ చేసుకోని.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి ఉంటే.. ఈ సీజన్‌లో చెన్నై పరిస్థితి వేరుగా ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా కెప్టెన్ మార్పుతోనే చెన్నై పరిస్థితి మెరుగుపడుతుందని ఇటు సీఎస్కే ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.
MS Dhoni is in form but…: Ravi Shastri explains why new CSK captain Jadeja is under pressure at IPL 2022#MSDhoni𓃵 #CSKvsPBKS #IPL2022 #RavindraJadeja
Read: https://t.co/Vl9M5Vlcly pic.twitter.com/MsPjauFOeH
— Times Now Sports (@timesnowsports) April 3, 2022
ఇది కూడా చదవండి: వీడియో: నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు దిమ్మతిరిగింది!
జడేజా అద్బుత ఆటగాడని.. అనవసరంగా అతనిపై కెప్టెన్సీ భారం వేసి.. అతని ఆటను ప్రభావితం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీఎస్కే మరో రెండు, మూడు మ్యాచ్‌లు ఓడితే మాత్రం కచ్చితంగా కెప్టెన్సీలో మార్పు చూడొచ్చు. ఈ సీజన్ మధ్యలోనో లేదా జడేజాకు మరికొంత అవకాశం ఇచ్చి.. వచ్చే ఏడాదికో సీఎస్కే కొత్త కెప్టెన్ నియమించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి కెప్టెన్సీ మార్పు.. కొత్త కెప్టెన్ గా ఎవరైతే బాగుంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
4 Consecutive lose in IPL
CSK : 2010, 2022#WhistlePodu | #IPL2022 pic.twitter.com/WtRBv5rlfL
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.