ఐపీఎల్‌తో ఎంతో మంది ప్రతిభగల యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ఆ జాబితాలో ఇప్పుడు మరో ప్లేయర్ చేరాడు. తనే రాజస్తాన్ రాయల్స్ యువ పేసర్, 25 ఏళ్ల కుల్దీప్ సేన్. ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచులో ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 15 పరుగులు కావాలి. కానీ అప్పటికే అనుభవం గల బౌలర్ల కోటా ముగియడంతో.. రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్.. కుల్దీప్ సేన్ చేతికి బంతి అందించాడు. అప్పటికి క్రీజులో ఉన్న స్టోయినిస్ ను అద్భుతంగా కట్టడి చేసి ఆఖరి ఓవర్లో.. 11 పరుగులే ఇచ్చి రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు కుల్దీప్ సేన్.
కుల్దీప్ సేన్ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో తెలిస్తే.. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్ళకి దక్కింది అనక మానరు. ఎందుకంటే కుల్దీప్ సేన్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి బార్బర్. మధ్యప్రదేశ్ రెవా జిల్లాలోని హరిహర్‌పూర్ పట్టణం వీళ్ల స్వస్థలం. సొంతూరులో తండ్రి రామ్ పాల్ సేన్‌కు ఉన్న హెయిర్ సెలూన్ షాపే కుటుంబానికి జీవనాధారం. తండ్రి కష్టాలు చూసి పెరిగిన కుల్దీప్.. ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టే ప్రదర్శనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
what a player … you dont expect things like this from debutant but when they do so you feel more satisfied… take a bow , KULDEEP SEN💯❤️#RRvsLSG | #IPL2022 pic.twitter.com/sJOFnpLcJ1
— Harshit (@ahhshitharshit) April 10, 2022
ఇది కూడా చదవండి: రికీ పాంటింగ్ పై పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు!
కుల్దీప్ సేన్ టాలెంట్‌ను గుర్తించిన రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్ వేలంలో రూ. 20 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేసింది. అంతేకాకుండా తమ నాలుగో మ్యాచ్‌లోనే అతనికి అవకాశం ఇచ్చింది. టీమ్ నమ్మకాన్ని నిలబెట్టిన కుల్దీప్ సేన్.. ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి హీరో అయ్యాడు. కుల్దీప్ సేన్ ఆటను రామ్ పాల్ సేన్.. ఆదివారం రాత్రంతా తన హెయిర్ సెలూన్‌లోనే ఉండి చూశాడు.
Kuldeep Sen’s story is remarkable, and here he has Sachin Tendulkar praising his bowling action 👏#RajasthanRoyals #IPL2022 pic.twitter.com/iBrv7GXv5U
— CricXtasy (@CricXtasy) April 12, 2022
A debut to remember for Kuldeep Sen 🔥
📸: BCCI/IPL#KuldeepSen #IPL2022 #RRvsLSG #Cricket pic.twitter.com/4KHAa7auvT
— SportsTiger (@sportstigerapp) April 10, 2022
కుల్దీప్ సేన్ తండ్రి రామ్ పాల్ సేన్ స్పందిస్తూ..”30 ఏళ్ల నుంచి నేను ఈ బార్బర్ వృత్తి చేస్తున్నాను. ఇన్నేళ్లలో ఈ రోజు ఉన్నంత బిజీగా నేను ఎప్పుడూ లేను. కనీసం తినడానికి కూడా నాకు ఖాళీ లేదు. ఇదంతా నా కొడుకు వల్లే. కానీ.. వాడు క్రికెట్ ఆడటానికి నేను ఏ రోజూ సహకరించలేదు.. పైగా కొట్టాను కూడా.. ఈరోజు వాడి కలలు నెరవేరాయి” అని రామ్ పాల్ సేన్ చెప్పుకొచ్చాడు. ఈ యువ క్రికెటర్ (కుల్దీప్ సేన్)పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియయజేయండి.
Kuldeep Sen’s father is proud of his performance 🙌 #IPL2022 #HallaBol pic.twitter.com/tY46dz6moF
— Sportskeeda (@Sportskeeda) April 12, 2022
ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యాపై పందెం కాసి అడ్డంగా బుక్కైన అభిమాని