ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో 19 పరుగుల చేసి గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీని అందుకుంది. ముఖ్యంగా.. చివరి 2 బంతుల్లో ఏకంగా 12 పరుగులు అవసరమైన దశలో రాహుల్ తెవాటియా రెండు స్టన్నింగ్ సిక్సులతో మ్యాచ్ గెలిపించాడు. ఆ రెండు బంతులకు ముందు మ్యాచ్ గెలుస్తామని గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌కు నమ్మకమే లేదు.. కానీ తెవాటియా పంజాబ్ టీమ్‌తో పాటు.. గుజరాత్ ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురిచేశాడు. ఈ సూపర్ విక్టరీతో గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అన్‌బీటెన్‌గా ఉంది.
కాగా ఈ మ్యాచ్ పంజాబ్ చేతుల్లోంచి పోవడానికి ఆ జట్టు ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్ అని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఒడియన్ స్మిత్ ఆఖరి ఓవర్‌లో 18 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. చివరి రెండు బంతులకు రెండు సిక్స్‌లు ఇచ్చి పంజాబ్ కింగ్స్ కొంపముంచాడు. ముఖ్యంగా నాలుగో బంతికి అతను చేసిన తప్పిదం పంజాబ్ ఓటమినే శాసించింది. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 19 పరుగులు అవసరం అవ్వగా.. ఓడియన్ స్మిత్ తొలి బంతిని వైడ్‌గా వేసాడు. రెండో బంతిని కూడా అలానే వైడ్‌గా వేయగా.. మిల్లర్ ముందుకు జరిగి ఉండటంతో అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దాంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగు కోసం వచ్చిన హార్దిక్ పాండ్యా రనౌటయ్యాడు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తెవాటియా సింగిల్ మాత్రమే తీశాడు. దాంతో గుజరాత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. మూడో బంతిని ఫోర్ కొట్టిన మిల్లర్ నాలుగో బంతిని బౌలర్ వైపే ఆడాడు. అయితే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో తెవాటియా పరుగు కోసం క్రీజును దాటడంతో.. స్మిత్ రనౌట్ కోసం ప్రయత్నించాడు. బంతి వికెట్లను తాకకపోగా.. ఓవర్ త్రో రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో గుజరాత్ విజయానికి 2 బంతుల్లో 12 పరుగులుగా అవసరమయ్యాయి. స్ట్రైక్‌లోకి వచ్చిన తెవాటియా లెగ్ సైడ్ తన ఫేవరేట్ షాట్లతో రెండు సిక్స్‌లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. అసలు స్మిత్ ఆ ఓవర్ త్రో ఇవ్వకుంటే గుజరాత్‌కు 2 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యేవి. అంతేకాకుండా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్స్ ఆడటంలో ఇబ్బంది పడుతున్న మిల్లర్ స్ట్రైకింగ్‌లో ఉండేవాడు. పంజాబ్ సులువుగా గెలిచేది. కానీ ఓడియన్ స్మిత్ ఓవర్ యాక్షన్‌తో మ్యాచ్ పంజాబ్ చేజారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్‌స్టోన్, షారుఖ్‌ఖాన్, రాహుల్ చాహర్ రాణించారు. ఇన్నింగ్స్ డెత్ ఓవర్లలో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. లేకుంటే స్కోర్ 200 దాటిపోయేది. లక్ష్యఛేదనను ధాటిగా ఆరంభించిన గుజరాత్.. మధ్యలో తడబడి, చివర్లో తెవాటియా దయతో గెలిచింది. మరి ఈ మ్యాచ్‌పై, ఓడియన్ చివరి ఓవర్, తెవాటియా రెండు సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చాహల్.. నిన్ను చంపబోయింది ఎవరు?: వీరేంద్ర సెహ్వాగ్
Shu vaat ‘chhe’ x 2⃣pic.twitter.com/DiTB9e473X
— Gujarat Titans (@gujarat_titans) April 8, 2022
It was 12 runs off 2 balls…and Tewatia finishes it off with 2 sixes.#IPL2022 #Tewatia #GTvsPBKS pic.twitter.com/YEb2mXeZxI
— SoNu 🖤 (@S_kumar_7091) April 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.