డివిలియర్స్ బ్యాటింగ్ స్టైల్‌తో ఐపీఎల్ 2022లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు యువ క్రికెటర్ బదోని. దీంతో ఒక్క మ్యాచ్‌తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అతన్ని బేబీ ఏబీడీగా పిలువడంతో.. మరింత పాపులర్ అయ్యాడు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో కూడా రెండు సూపర్ సిక్సులతో మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించించాడు. అచ్చం ఏబీ డివిలియర్స్‌లా మొకాళ్లపై కూర్చోని.. స్క్వైర్ లెగ్ పైనుంచి భారీ సిక్స్ కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేసిన బదోని.. నిన్నటి మ్యాచ్‌లో 9 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఇలా తొలి రెండు మ్యాచ్‌లతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఈ యంగ్ టాలెంటెడ్ బ్యాటర్‌ను టీమిండియా దిగ్గజ క్రికెటర్, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడో గుర్తించాడు. గతంలో ద్రవిడ్ భారత అండర్ 19 కోచ్‌గా, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా చేసిన విషయం తెలిసిందే. అండర్ 19 కోచ్‌గా ఉన్న సమయంలోనే బదోనిలోని టాలెంట్‌ను ద్రవిడ్ గుర్తించాడు. ఈ విషయాన్ని.. టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ తెలిపాడు. వాసన్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన క్రికెట్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్‌గా ఉన్న సమయంలో ద్రవిడ్ తనకు బదోని గురించి చెప్పినట్లు వెల్లడించాడు. ‘మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్.. ఒక సారి చూడండి’ అంటూ ద్రవిడ్, వాసన్‌కు చెప్పాడు.అదే విషయాన్ని డీడీసీఏ జట్టు ఎంపిక సమయంలో వాసన్ సెలక‌్షన్ కమిటీ ముందు ఉంచితే.. ఢిల్లీ సెలక‌్షన్ కమిటీ బదోనిని పక్కన పెట్టినట్లు అతను తెలిపాడు. అతని స్థానంలో టీమిండియా అండర్ 19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌ను ఎంపిక చేసినట్లు కూడా వాసన్ వెల్లడించాడు. ద్రవిడ్ గుర్తించిన ఆణిముత్యాన్ని డీడీఏసీ పట్టించుకోలేదని.. వాసన్ తెలిపాడు. జట్టు ఎంపికలో తాను తల దూర్చడం ఇష్టంలేక.. సమావేశం నుంచి బయటికి వచ్చేసినట్లు వాసన్ పేర్కొన్నాడు. ఇప్పడు బదోని ఐపీఎల్‌లో అదరగొడుతుండడంతో వాసన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: CSK చరిత్రలో ఇలా మొదటి సారి జరిగింది..!
Imagine it from Badoni’s pov. You walk out with 40 needed off 16, facing IPL’s leading wkt taker, behind the stumps you see one of the greatest finishers, you look at the area you’re targetting, world’s best fielder is there. And then you impress them all! #CSKvLSG #IPL2022 pic.twitter.com/45Mttt8m8z
— Wasim Jaffer (@WasimJaffer14) March 31, 2022
Ayush Badoni and Evin Lewis – Nerves of steel🥶
📸: IPL/BCCI#IPL2022 #LSGvCSK pic.twitter.com/rs0qAQ9GeO
— CricTracker (@Cricketracker) March 31, 2022
What a shot by Ayush Badoni, superb! pic.twitter.com/cVEEZykE2m
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.