ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కావడానికి గంటల సమయం మాత్రమే ఉంది. అందుకు తగ్గట్టుగానే సన్ రైజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా రకాలుగా కష్టపడుతున్నారు. ఇలా ఒక వైపు మైదానంలో చెమటోడ్చుతూనే.. గతేడాది పేలవ ప్రదర్శనతో.. తమపై ఆగ్రహంగా ఉన్న అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు అభిమానులను మచ్చిక చేసుకునేందుకు భాషతో పాటు సినిమాలను అస్త్రంగా వాడుకుంటోంది ఎస్‌ఆర్‌హెచ్.
ఇప్పటికే.. నాచురల్ స్టార్ నాని నటించిన ‘సుందరం’ మూవీ అప్ డేట్ చెప్పిన సన్‌రైజర్స్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ మూవీ సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్‌కు యువ ప్లేయర్ అభిషేక్ శర్మతో స్టెప్పులు వేయించింది. ఇక తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లోని పాపులర్ డైలాగ్ ‘తగ్గేదేలే’ను తమ ఆటగాళ్లతో ఇమిటేట్ చేయించింది. వారి మధ్య ఈ డైలాగ్ పోటీ పెట్టింది. ఎవరు ఈ స్టైల్‌ను బాగా అనుకరించారు? అని అభిమానులను ప్రశ్నించింది. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, రాహుల్ త్రిపాఠిలతో పాటు మరో ఇద్దరు ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే అభిమానులు మాత్రం.. డేవిడ్ వార్నర్ ను మిస్ అయ్యామంటూ కామెంట్ చేస్తున్నారు.
Thag Life, #Pushpa style. 😎🔥#TATAIPL #OrangeArmy #ReadyToRise@alluarjun @PushpaMovie @ThisIsDSP pic.twitter.com/x8lAXZPrzB
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022
ఇది కూడా చదవండి: మహేష్‌బాబు ‘కళావతి’ స్టెప్ నేర్చుకునేందుకు SRH ప్లేయర్ల ఆపసోపాలు
బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ను తీసుకుని అంచనాలు పెంచిన సన్ రైజర్స్.. మెగా వేలంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాదైనా బలమైన కొత్త ప్లేయర్లతో బరిలో నిలుస్తారనుకున్న ఫ్యాన్స్ ఆశల్ని అడియాశలు చేసింది. ఎప్పట్లానే కేవలం బౌలర్లపైనే ఫోకస్ చేసిన ఆరెంజ్ ఆర్మీ మరోసారి బలహీన బ్యాటింగ్ లైనప్‌తో పోటీపడనుంది. ఈ జట్టుతో టైటిల్ గెలవడం దేవుడెరుగు.. ప్లే ఆఫ్స్ చేరితే చాలంటున్నారు అభిమానులు.
The dance, you saw. 🕺
The making, you now see 😅#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/76RHAhDXQI
— SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022
Mark the dates ✍️#OrangeArmy, here’s your #OrangeCalendar for #IPL2022 🧡#IPLFixtures #TATAIPL #ReadyToRise pic.twitter.com/cJfHlPRFwn
— SunRisers Hyderabad (@SunRisers) March 6, 2022