ఐపీఎల్ 2022లో భాగంగా 16వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తుంది. గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచింది. అలాగే పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీద ఉంది. మూడో గెలుపును సొంతం చేసుకోవాలని ఆ జట్టు బలంగా కోరుకుంటుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం..
పంజాబ్ కింగ్స్..
ఈ టీమ్‌కు టాప్‌ఆర్డర్, మిడిల్డార్ బాగుంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ రూపంలో మంచి ఓపెనింగ్ జోడి ఈ జట్టు సొంతం. అలాగే భానుక రాజపక్సా, లివింగ్‌స్టోన్‌తో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తుంది. అలాగే ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్‌కు కూడా చివరి ఓవర్లలో పరుగుల రాబట్టే సామర్థ్యం ఉంది. బౌలింగ్‌ల పంజాబ్ కొంత వీక్‌గా కనిపిస్తుంది. పేస్‌లో కగిసో రబడా, ఓడియన్ స్మిత్.. స్పిన్‌లో రాహుల్ చాహర్ మాత్రమే కనిపిస్తున్నారు. వీరిలో ఏ ఇద్దరు రాణించకపోయిన పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
గుజరాత్ టైటాన్స్..
హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ లాంటి ఇద్దరు మ్యాచ్ విన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి రావడం జీటీకి కలిసొచ్చే అంశం. కాగా గుజరాత్‌లో మంచి పేరున్న బ్యాటర్లు కనిపించడం లేదు. ఓపెనర్ వేడ్ ఇప్పటి వరకు రాణించలేదు. హార్థిక్ పాండ్యా రెండు మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా.. లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేడు. విజయ్ శంకర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించే అవకాశం ఉంది. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌ను పంజాబ్ బౌలర్లు కట్టడి చేస్తే.. గెలుపు ఖాయం.
తుది జట్ల అంచనా..
పంజాబ్.. మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, లివింగ్‌స్టన్, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, రాజ బవా, కగిసో రబడా, హర్పీత్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్.
గుజరాత్ టైటాన్స్ – హార్థిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, మ్యాథ్యూ వేడ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, వరణ్ అరోణ్, రషీద్ ఖాన్, మొహ్మమద్ షమీ, ఫెర్గూసన్.
ఇదీ చదవండి: IPLలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆర్సీబీ!
We’ve got our own Titan waiting to make his PBKS debut against Gujarat Titans. 😍
Read more in our #PBKSvGT preview ⤵️#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ https://t.co/tfMRfV1htp
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.