ఐపీఎల్ టోర్నీలో.. ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఒక్క విజయం కోసం అల్లాడిపోతోంది. సమష్టి వైఫల్యంతో వరుసగా ఆరోసారి మ్యాచ్ ఓడిన ముంబై.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేకపోయింది. 2015 ఐపీఎల్ సీజన్‌లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసినప్పటికి.. ఆరో మ్యాచ్‌లో విజయం సాధించి.. ఆ తర్వాత చాంపియన్‌గా నిలిచింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ముంబై ఇండియన్స్ కోలుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్సేనా ఇప్పుడు ఆడుతుంది అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నోసూపర్ జెయింట్స్.. కేఎల్ రాహుల్ తన వందో ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొత్తంగా 9 ఫోర్లు, 6 సిక్సులతో 60 బంతుల్లో 103 పరుగులు చేసిన రాహుల్ నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఐపీఎల్‌లో వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మిగిలిన వారిలో మనీష్ పాండే 38, క్వింటన్ డికాక్ 24 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు, ఎం. అశ్విన్, ఫాబిన్ అలెన్ తలో వికెట్ తీశారు.
Someone: What is the best feeling?
Me: Seeing KL Rahul like this😌❤️💯#KLRahul #IPL2022 #MIvsLSG pic.twitter.com/IuXNRLYo35— Abhay Patel❤️ (@abhu7214) April 16, 2022
A hundred on his hundredth IPL match. 😭❤️#MIvsLSG | #KLRahul pic.twitter.com/3GCiePQtX4
— KL Rehul (@OrangeCapPopa) April 16, 2022
ఇది కూడా చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! రోహిత్ శర్మపై నిషేధం విధిస్తారా?
అనంతరం.. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరోసారి ఆదుకున్నారు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 48 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరకు 20 ఓవర్లలో.. 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఫలితంగా.. లక్నో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Captain speaks.#OneFamily #DilKholKe #MumbaiIndians #MIvLSG @ImRo45 pic.twitter.com/ko84Itgb3Z
— Mumbai Indians (@mipaltan) April 16, 2022
Regroup. Rethink. Refocus. #OneFamily #DilKholKe #MumbaiIndians #MIvLSG pic.twitter.com/rikk8WEv2R
— Mumbai Indians (@mipaltan) April 16, 2022
ఇక.. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూట గట్టుకుంది. ఐపీఎల్ టోర్నీలో.. ఒక సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన మూడో జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరించింది. ఇంతకముందు 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2019లో ఆర్‌సీబీ జట్లు.. వరుసగా ఆరు మ్యాచ్‌లు వరుసగా ఓడాయి. అంతేకాదు ఈ జట్లు ఆయా సీజన్లను చివరి స్థానంతో ముగించాయి. ఇప్పుడు ముంబై కూడా అదే బాటలో పయనిస్తోంది. ముంబై ఆటతీరు చూస్తుంటే సీజన్‌ను ఆఖరి స్థానంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
Lasith Malinga pens down a beautiful tweet for his former IPL side 🏏💯#ipl #ipl2022 #mumbaiindians pic.twitter.com/TgPuUjjYWa
— Sportskeeda (@Sportskeeda) April 16, 2022
Rohit Sharma right now. #MIvsLSG pic.twitter.com/fJt2inbESB
— Rajabets India🇮🇳👑 (@smileandraja) April 16, 2022
Feeling 😥😶#MIvsLSG pic.twitter.com/IjF1ctCF4R
— Yash (@Yashrajput027) April 16, 2022
ఇది కూడా చదవండి: IPL లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకి కారణం?
Mumbai Indians right now 👇😂#MIvsLSG#MIvsLSG #MumbaiIndians pic.twitter.com/bg33OzZmUx
— Mani Shankar Aiyar (@ManiSAiyarINC) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.