క్రికెట్ కంటే ఫుట్‌బాల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అభిమానులు ఉంటారు. అందులో ఎవరీ ఎలాంటి అనుమానాలు లేవు. ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న ఫుట్‌బాల్ క్రీడలో ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ.. ఒక్క విషయంలో అతంటి క్రేజ్ ఉన్న టోర్నీ కూడా మన ఐపీఎల్ ముందు చిన్నబోయింది. ఎందులోనో తెలుసా.. టికెట్ల విషయంలో. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఫిఫా వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల టికెట్ల ధర కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఖతార్ వేదికగా నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్‌కప్ సమరం జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 28 వరకు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే టికెట్ రేట్ విషయం కాస్త షాక్ కలిగించింది. ఒక మ్యాచ్ టికెట్ రేటు 250 ఖతార్ రియాల్‌గా ఉంది.(మన కరెన్సీలో దాదాపు రూ.5,211).. ఇది మన ఐపీఎల్ టికెట్ రేట్స్‌లో సగం మాత్రమే.
ఇక ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర రూ. 45,828.. మన ఐపీఎల్ టికెట్‌తో పోలిస్తే రూ.10వేల వ్యత్యాసం మాత్రమే ఉంది. నాలుగేళ్లకోసారి మాత్రమే ఫిఫా వరల్డ్‌కప్ రేట్లు.. గత వరల్డ్ కప్ రేట్లకు డబుల్ అయ్యాయి. ఎప్పుడో నాలుగేళ్ల రేట్లను పెంచడంతోనే ఇంత ధర తక్కువగా ఉంది. అందుకే ఐపీఎల్ టికెట్ రేట్లతో పోలిస్తే అవి తక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! రోహిత్ శర్మపై నిషేధం విధిస్తారా?
#DidYouKnow? #FIFAWorldCupQatar2022 will be less expensive than experiencing #IPL2022 in Mumbai https://t.co/ptzgDJEWO6
— Zee News English (@ZeeNewsEnglish) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.