టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌గా, కోల్‌కతా నైట్‌రైడర్స్ సారధిగా.. శ్రేయాస్ అయ్యర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అద్భుతమైన షాట్లతో పాటు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునే 27 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందులోనూ.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి చెప్పక్కర్లేదు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో ఈ యువ క్రికెటర్ కి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. మ్యాచ్ చూడడానికి వచ్చిన.. ఒక అభిమాని.. శ్రేయాస్ పై తనకున్న ప్రేమను బహిరంగంగానే బయటపెట్టింది.
ఇదిగోండి.. ఫొటోలో కనిపించే అమ్మాయికి.. శ్రేయాస్ అయ్యర్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అంతేకాదు.. వీలైతే అతడిని తన జీవిత భాగస్వామిగా పొందాలన్న ఆరాటం. అందుకే.. తనకు శ్రేయాస్ అయ్యర్ మీద ఉన్న ప్రేమను బహిరంగంగానే ప్రకటించింది ఈ అమ్మాయి. ‘‘అబ్బాయిని వెతుక్కోమని మా అమ్మ చెప్పింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయస్ అయ్యర్?’’ అన్న అక్షరాలు రాసి ఉన్న ప్లకార్డుతో ఆమె.. అయ్యర్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టింది.
That’s one way of shooting your shot! 👏#KKRHaiTaiyaar #RRvKKR #IPL2022 pic.twitter.com/FDaO7VOXdx
— KolkataKnightRiders (@KKRiders) April 18, 2022
ఇది కూడా చదవండి: IPL ఫిక్సింగ్ అనే వారికి ఇదే సమాధానం!
సోమవారం(ఏప్రిల్ 18) రాజస్తాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ సందర్భంగా.. అయ్యర్ పట్ల తన మనసులోని భావాలను ఈ అమ్మడు బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కేకేఆర్ తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పండ్సితున్నారు. ఒక యూజర్.. “అయ్యర్ కు 27 ఏళ్ళు వచ్చాయి.. ఇప్పటివరకు ఖాళీగా ఉంటాడా?.. ఎవరి మాయలోనో పడే ఉంటాడు” అని కామెంట్ చేశాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. భలేగా ప్రపోజ్ చేశావు!.. అయ్యర్ నీ గురుంచి తప్పకుండా ఆలోచిస్తాడు” అని కామెంట్ చేశాడు.
Levitating 🪄 pic.twitter.com/9IPOJUGqvZ
— Shreyas Iyer (@ShreyasIyer15) April 14, 2022
Not our night but there’s plenty of fire within us 💜💛 pic.twitter.com/uKtavkOnRr
— Shreyas Iyer (@ShreyasIyer15) April 18, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) విధ్వంసానికి తోడు.. సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు. అనంతరం.. 218 పరుగుల లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్‌తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్‌కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.
IPL Update #RR vs #KKR #KKRvsRR #news #viral #india #ipl #barakoutlet pic.twitter.com/RltL3tWHI3
— BARAK OUTLET (@BarakOutlet) April 19, 2022
ఇది కూడా చదవండి: IPL 2022లో తొలి హ్యాట్రిక్! ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్న చాహల్