ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ అదరగొడుతున్నారు. ఈ సీజన్‌లో అతను మూడో సెంచరీ కూడా బాదేశాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సులతో 116 పరుగులు చేశాడు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్ పవర్‌ప్లేయర్ చివరి ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఫోర్లు, సిక్సులతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గత మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై సెంచరీ బాదిన బట్లర్ ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. దీంతో బట్లర్‌కు ఈ సీజన్‌లో ఇది మూడో సెంచరీ. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీల రికార్డును బట్లర్ బ్రేక్‌చేసేలా ఉన్నాడు.
2016 సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు చేశాడు. ఇప్పుడు కేవలం సగం మ్యాచ్‌లే అవ్వడంతో బట్లర్ మరో రెండు సెంచరీలు చేస్తే.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేయొచ్చు. కాగా.. ఇలా తన సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్న బట్లర్ తనకున్న మనసులో ఉన్న ఒక కోరికను బయటపెట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయాలని ఉందని బట్లర్ పేర్కొన్నాడు. అది తన డ్రీమ్ అని అన్నాడు. ప్రస్తుతానికి ఐపీఎల్‌లో బట్లర్ పార్టనర్‌గా దేవదత్ పడిక్కల్ వస్తున్నాడు. ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు జైస్వాల్ వచ్చాడు.
కానీ.. బట్లర్ కోరిక మాత్రం ఇప్పట్లో తీరేలా లేదు. బట్లర్ కోరిక తీరాలంటే రోహిత్ శర్మ రాజస్థాన్‌కు ఆడాలి.. అది జరగని పని, రోహిత్‌ను ముంబై ఫ్రాంచైజ్ వదులుకోదు. లేదా.. బట్లర్ ముంబై ఇండియన్స్‌కు ఆడాలి. ఇప్పుడు బట్లర్ ఉన్న ఫామ్‌ను చూస్తే.. రాజస్థాన్ ఎంత ఖర్చయినా అతన్ని రిటేన్ చేసుకుంటుంది. సో.. వచ్చే సీజనే కాదు.. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్ చేయడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. కానీ.. బట్లర్, రోహిత్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తే మాత్రం.. స్కోర్ బోర్డు రేసు గుర్రంలా పరిగెత్తడం ఖాయం. మరి బట్లర్ డ్రీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నో బాల్ ఘటనపై సీరియస్ అయిన ఐపీఎల్ కమిటీ! పాపం.. పంత్ బలి
— Sayyad Nag Pasha (@PashaNag) April 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.