ఐపీఎల్ 2022లో టీమిండియా ప్రధాన బౌలర్లు అదరగొడుతున్నారు. ఈ ఐపీఎల్ తర్వాత కొని సీరిస్‌లు ఆ వెంటనే అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీంతో ప్రస్తుతం భారత బౌలర్ల ఫామ్ చూసి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో వరల్డ్ కప్ ఆశలు చిగురిస్తున్నాయి. పేస్‌లో మొహమ్మద్ షమీ, బుమ్రా, ఉమేష్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరుగుతున్నారు. అలాగే స్పిన్‌లో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తమ సత్తా చాటుతున్నారు. వీళ్ల ప్రదర్శన చూస్తే.. టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఎప్పుడూ లేనంతా స్ట్రాంగ్‌గా, షార్ప్‌గా కనిస్తుంది.
ఈ బౌలింగ్ ద్వయాన్ని ఎదుర్కొని నిలబడగలిగే బ్యాటింగ్ లైనప్ ఏ జట్టులోనైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చాహల్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైఎస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఉమ్రాన్ మాలిక్ స్పీడ్‌కు వికెట్లు పిట్టల్లా ఎగురుతున్నాయి. ఐదుగురు బౌలర్లతో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగితే.. ఐదుగురికి ఐదుగురు వికెట్ టేకర్ బౌలర్లే ఉంటారు. ప్రస్తుతం వీరి ఫామ్ చూస్తే.. టీమిండియా వరల్డ్ కప్‌లో తిరుగులేదనిపిస్తుంది. కానీ అదే సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం చాలా దారుణంగా నిరాశ పరుస్తుంది.
టీమిండియా ఉద్ధండ పిండాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అత్యంత దారుణమైన ఫామ్‌లో ఉన్నారు. అలాగని వీరు లేని టీమిండియాను ఊహించుకోవడం ఇప్పటికైతే సాధ్యం కాదు. వీరికి తోడు వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ కూడా దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. ఈ నలుగురు టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉండే ఆటగాళ్లే కానీ.. వీరి ఫామ్ చూస్తే మాత్రం ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందుతున్నారు. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఈ సీజన్‌లో రాణిస్తున్నారు. ఇదే ఆట తీరు కొనసాగితే.. టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ భారం మొత్తం ఈ ముగ్గురిపైనే పడనుంది.
పైగా ధావన్ జట్టులో ఉంటాడో లేదో తెలియదు. అలాగే హార్థిక్ పాండ్యా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను ఈ సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌కు తోడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే.. బ్యాటింగ్‌లో కూడా తిరుగుండదు. పోని రోహిత్ శర్మ కెప్టెన్ కనుక అతన్ని వదిలేసి, కోహ్లీకి జట్టను నుంచి తప్పిందాం అని సెలెక్టర్లు భావించినా.. టీ20 వరల్డ్ కప్ జరగబోయేది ఆస్ట్రేలియాలో అక్కడ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ ఎంతో అవసరం. ఐపీఎల్ ఫామ్ చూపి కుర్రాళ్లను పంపితే.. టీమిండియా బొక్కబోర్లా పడటం ఖాయం అనే వాదన కూడా వినిపిస్తుంది. దీంతో టీమిండియా పరంగా ఆలోచిస్తే.. బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉన్నా.. బ్యాటర్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Shardul Thakur: వీడియో: IPL హిస్టరీలోనే అత్యంత చెత్త బాల్ వేసిన శార్థుల్ ఠాకూర్!
Having played six innings each, KulCha are the leading wicket-takers of #IPL2022 so far 🙌
The two will face off against each other tonight in Mumbai 👉 https://t.co/UKr4zINpYV #DCvRR pic.twitter.com/XdnLRkRZjL
— ESPNcricinfo (@ESPNcricinfo) April 22, 2022
Leading Wicket -Takers of #IPL2022
18 – Yuzi Chahal (7 inn
17 – Natarajan (7 Inn
14 – Dj bravo (8 inn
13 – Kuldeep yadav (7 inn
11 – Umesh yadav (8 inn
12 – khaleel Ahmed (6 inn
11 – Avesh khan (7 inn@yuzi_chahal on top#CricketTwitter #yuzichahal #HallaBol pic.twitter.com/o3wcVCm4t8
— Cricket Syco (@cricket_syco) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.