ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్! సీజన్ ప్రారంభానికి ముందు ఆ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్ద గండం నుంచి గట్టెక్కాడు. సుదీర్ఘ కాలంగా వరుస గాయాలతో బాధపడుతూ వచ్చిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రకటించింది. దాంతో ఐపీఎల్ ఆడేందుకు అతనికి మార్గం సుగుమమైంది.
గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్ట్‌లతో పాటు యోయో టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో హార్దిక్ పాండ్యా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసినట్లు, యోయో టెస్ట్‌లో 17 స్కోర్ నమోదు చేసినట్లు తెలిపింది. యోయో టెస్ట్ కటాఫ్ 16.5 కాగా.. పాండ్యా బార్డర్‌లో గట్టెక్కాడు. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఎన్‌సీఏలో అతడు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ.. అతడు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించి.. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలిగాడు. 17 ప్లస్ స్కోరు చేశాడు. నిజానికి నిర్ణీత స్కోరు కన్నా ఇది ఎక్కువే’’ అని పేర్కొన్నారు.2015 ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ లోకి అడుగుపెట్టిన పాండ్యా.. అతి తక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నాడు అంటే.. అయితే మ్యాచ్ ఇంకా అయిపోలేదు అన్నంతగా. అంతటి స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యాను రిటెన్షన్ సమయంలో ముంబై ఇండియన్స్ వదిలేసింది. గత సీజన్‌లో బౌలింగ్ చేయలేకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో విఫలం కావడం పాండ్యా కొంపముంచింది. వరుస గాయాలు అతడి కెరీర్‌ను మరింత ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ క్రమంలో ఎన్‌సీఏలో సుదీర్ఘకాలం పాటు చికిత్స తీసుకున్నాడు. ఫలితంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించి యో-యో టెస్టులో పాసయ్యాడు. ఇక హార్దిక్ ఆటతీరుపై నమ్మకం ఉంచిన గుజరాత్ యాజమన్యాం మెగా వేలానికి ముందే 15 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకొని తమ కెప్టెన్‌గా నియమించింది.
గుజరాత్ టైటాన్స్ టీమ్
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రషీద్ ఖాన్, శుభమన్ గిల్, మహ్మద్ షమీ, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, డొమినిక్ డ్రేక్స్, జయంత్ యాదవ్, విజయ్ శంకర్, దర్శన్ నల్కండే, యశ్ జోసెఫ్ దయాల్, ప్రదీప్, ప్రదీప్, అల్జారీ సాంగ్వాన్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, గురుకీరత్ సింగ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్.
Love the new threads, our armour for our first season👌 Let’s get down to work now @gujarat_titans pic.twitter.com/qn5mJeAo3G
— hardik pandya (@hardikpandya7) March 14, 2022