ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో 19 పరుగుల చేసి గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీని అందుకుంది. ముఖ్యంగా.. చివరి 2 బంతుల్లో ఏకంగా 12 పరుగులు అవసరమైన దశలో రాహుల్ తెవాటియా రెండు స్టన్నింగ్ సిక్సులతో మ్యాచ్ గెలిపించాడు. కాగా అంతకుముందు ఓడియన్ స్మిత్ తొలి బంతిని వైడ్‌గా వేశాడు. రెండో బంతిని కూడా అలానే వైడ్‌గా వేయగా.. మిల్లర్ ముందుకు జరిగి ఉన్నా.. ఆ బంతిని ఆడలేకపోయాడు. బాల్ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. అయినా కూడా మిల్లర్ లేని పరుగు కోసం ప్రయత్నించాడు. దాంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగు కోసం వచ్చిన హార్దిక్ పాండ్యా రనౌటయ్యాడు.
దీంతో తనను అనవసరంగా రనౌట్ చేసిన మిల్లర్‌పై హార్థిక్ పాండ్యా గ్రౌండ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం తెవాటియా నమ్మశక్యం కానీ బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలిపించడంతో హార్థిక్ పాండ్యా నవ్వులు చిందించాడు. లేకుంటే.. మ్యాచ్ ఓటమికి మిల్లర్ కారణం అయ్యే వాడు. ఎందుకంటే.. అప్పటి వరకు పాండ్యా సూపర్ టచ్‌లో ఉన్నాడు. 18 బంతుల్లో 27 పరుగులు చేసి పాండ్యా మ్యాచ్ గెలిపించే ఊపులో కనిపించాడు. కానీ మిల్లర్ తప్పిదం కారణంగా పాండ్యా రనౌట్ అవ్వడంతో మ్యాచ్ గెలిపించే అవకాశం తెవాటియాకు దక్కింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: హార్థిక్ పాండ్యాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ! తలొంచక తప్పలేదు
What a run-out by Jonny Bairstow, Hardik Pandya gone. pic.twitter.com/ZWm71VvhYc
— CricketMAN2 (@ImTanujSingh) April 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.