ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలి బంతికే రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షమీ వేసిన తొలి బంతిని రాహుల్ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లినట్లు అనిపించింది.
ఈ క్రమంలో వికెట్ కీపర్‌తో పాటు, గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్‌లు గట్టిగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ నాటౌట్ అని తల ఊపాడు. వెంటనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో సృష్టంగా బంతి బ్యాట్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుని ఔట్‌గా ప్రకటించాడు. ఇక 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్,గుజరాత్ టైటాన్స్ కొత్త జట్లుగా అవతరించిన సంగతి తెలిసిందే.
What a beauty from Mohammed Shami #LSGvsGT @MdShami11 @klrahul11 @IPL #mohammadshami pic.twitter.com/GMzzG8yrGz
— Sunny. (@sunnyda67155508) March 28, 2022
ఇది కూడా చదవండి: IPL 2022: CSK vs KKR మళ్లీ ఆరెంజ్ గ్లోవ్స్‌తో ధోనీ.. కారణం అదేనా?