ఐపీఎల్ 2022లో ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. లీగ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు క్వాలిఫైయర్ 2లో ఆడేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ విక్టరీని సాధించి.. రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫైయర్ 2లో పోటీపడనుంది. కాగా ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్‌లో ఒక ప్రత్యేకమైన అవార్డును ప్రవేశపెట్టి.. అది కచ్చితంగా విరాట్ కోహ్లీకే ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతుంది. అదే బెస్ట్ సెలబ్రేషన్ అవార్డు.
గ్రౌండ్‌లో విరాట్ కోహ్లీ ఎంత ఎనర్జీటిక్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమ్‌లో ఏ బౌలర్ వికెట్ తీసినా, ఏ బ్యాటర్ అద్భుతమైన షాట్ ఆడినా కోహ్లీ ఎంతో ఆనందపడిపోతుంటాడు. ఇన్‌ప్యాక్ట్ వాళ్ల కంటే కూడా ఎక్కువ సంబురాలు చేసుకుంటాడు. మైదానంలో కోహ్లీ అంత అగ్రెసివ్‌గా ఉండటం జట్టులో ఎంతో స్ఫూర్తి, ఉత్సహం నింపుతుంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తుమ ఆటగాడు. అలాంటి ప్లేయర్ అయిన కోహ్లీ.. ఇతరుల విజయాలను కూడా ఎంతో హుందా, నిష్కల్మశంగా అభినందిస్తాడు, ఆస్వాదిస్తాడు. జట్టుకు మేలు జరిగితే చాలా కోహ్లీ కంటే ఎక్కువ సంతోషించే ప్లేయర్ ఇంకొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ను కోహ్లీ అంతలా ప్రేమిస్తాడు. అందుకే తన జట్టు నుంచి ఏ ప్లేయర్ మంచి ప్రదర్శన కనబర్చిన కోహ్లీ ఆనందంతో ఉబ్బితబ్బిపోతాడు. గెలవాలనే కసి.. కోహ్లీని అంత అగ్రెసివ్‌గా ఉంచుతోంది.
బుధవారం లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో తన ఓపెనింగ్ పార్టనర్ డుప్లెసిస్ త్వరగా అవుట్ అవ్వడంతో కొంచెం ఆచీతూచి ఆడిన కోహ్లీ.. కొత్త కుర్రాడు, ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ రజత్ పటీదార్ మంచి టచ్‌లో కనిపించి, షాట్లు ఆడుతుండడంతో సింగిల్స్ తీసి అతనికి స్ట్రైకింగ్ ఇస్తూ సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. ఒక సీనియర్ ప్లేయర్ అయి ఉండి కూడా ఇంత నిస్వార్థంగా వ్యవహరించాడు. పైగా పటీదార్ షాట్లు కొడుతుంటే తానే కొట్టినట్లు సెలబ్రేట్ చేసుకుంటూ, పటీదార్‌ను అభినందిస్తూ కనిపించాడు. అలాగే తను అవుట్ అయి డగౌట్‌లో కూర్చున్నా.. ప్రతి షాట్‌కు లేచి నించుని మరీ తమ బ్యాటర్లను ఉత్సాహపరిచాడు. అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత.. కొన్ని అడుగులు గాల్లో పైకి దూకుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీ ఫ్యాన్స్ అతనికి బెస్ట్ సెలబ్రేషన్ అవార్డు ఇవ్వాలని సరదాగా డిమాండ్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొహ్‌సిన్ ఖాన్ ఆర్సీబీని తొలి ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతిశాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(0)ను తొలి ఓవర్ ఐదో బంతికి అవుట్ చేసి.. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న తన కెప్టెన్ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ ఇన్సింగ్స్‌ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్ మాత్రం ఎటాకింగ్ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(6)ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్‌వుట్ 3, సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి ఈ కోహ్లీకి బెస్ట్ సెలబ్రేషన్ అవార్డు ఇవ్వాలనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: లక్నోతో మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లోనే ప్రార్థన చేసి.. దేవుడికి థ్యాంక్స్ చెప్పిన కోహ్లీ
The winning celebration from Virat Kohli. The trademark jump. #Aakashvani #ViratKohli #ViratKohli𓃵 #RajatPatidar #RCB #RCBvLSG pic.twitter.com/3nBpyKO5W3
— 𝐀𝐓𝐀𝐋 𝐂𝐇𝐎𝐔𝐁𝐄𝐘 (@UjjwalC14572900) May 26, 2022
#RajatPatidar smashes century, #ViratKohli, RCB players give him standing ovation, see pics#RCBvsLSG | #IPL2022https://t.co/un7FFO8mM8
— DNA (@dna) May 25, 2022
Virat Kohli and the whole RCB dugout reaction when Rajat Patidar reached his century. pic.twitter.com/8dot5rsNwV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2022