ఐపీఎల్ 2022లో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య లోస్కోర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే హర్షల్ పటేల్ 2 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు సహా 2 వికెట్లు తీసి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న వరుణ్ చక్రవర్తికి హర్షల్ 16వ ఓవర్‌లో ఆఖరి బంతిని ఫుల్‌టాస్‌గా వేశాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి వన్ స్టప్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అది క్లియర్‌గా ఔట్ కాదని తెలిసినప్పటికీ.. బంతి వరుణ్ చక్రవర్తి బూట్లకు తగిలి బ్యాట్‌కు తగిలిందేమోనని హర్షల్ పటేల్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ హర్షల్ పటేల్ కెప్టెన్ డుప్లెసిస్‌వైపు చూడడం.. అతను రివ్యూ తీసుకోవడం జరిగిపోయింది.ఇక రిప్లేలో బంతి ఎక్కడా కనీసం బ్యాట్స్‌మన్ బూట్లకు తగిలినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాదు బంతి బ్యాట్ మిడిల్‌లో తగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ”డుప్లెసిస్ తీసుకున్న రివ్యూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోతుంది’’ ఫ్యాన్స్ సోషల్ మీడియలో కామెంట్ చేస్తున్నారు. రివ్యూ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంతో ఇలాంటి తప్పిదాలు అంతగా చర్చకు రావడం లేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB vs KKR: ఉమేష్ యాదవ్ చేసిన ఈ తప్పే.. KKR కొంపముంచింది!
— That-Cricket-Girl (@imswatib) March 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.