ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ బౌలర్ డేనియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు కొట్టాడు. దీంతో డేనియల్ సామ్స్ ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటికే ఐపీఎల్ అత్యధిక బౌలింగ్ యావరేజ్ 242తో అత్యంత చెత్త రికార్డును కలిగి ఉన్న సామ్స్‌తో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చి.. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అంతకుముందు 2011లో పీ. పరమేరశ్వరన్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు ఇచ్చాడు. 2021లో హర్షల్ పటేల్ కూడా 37 పరుగులు ఇచ్చాడు సీఎస్‌కేకు. ఇక మూడో స్థానంలో సామ్స్ నిలిచాడు.నిజానికి సూర్యకుమార్ యాదవ్ వల్ల సామ్స్ నంబర్ వన్ ప్లేస్‌కు వెళ్లకుండా బతికిపోయాడు. సిక్స్ వెళ్లే నోబాల్‌ను అద్భుత క్యాచ్‌తో రెండు పరుగులతో సరిపెట్టాడు సూర్యకుమార్. లేకుంటే.. సామ్స్ 40 పైనే పరుగులు సమర్పించేవాడు. దీంతో నెటిజన్లు డేనియల్ సామ్స్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘‘బుమ్రా, మిల్స్‌ను డెత్ ఓవర్లలో పంపించాలని రోహిత్ ప్లాన్ చేశాడు. కానీ డేనియల్ సామ్స్ కెప్టెన్‌కు ఆ అవకాశం ఇస్తే కదా! 16వ ఓవర్లోనే ప్రత్యర్థి జట్టుకు మ్యాచ్ అప్పగించేశాడు. బాగుంది’’ అంటూ రకారకాల మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. మరి సామ్స్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తెలుగోడు తిలక్ వర్మ కొట్టిన సిక్స్‌కు కళ్లు తేలేసిన కమిన్స్
Everyone buzy with Pat Cummins half century and no one noticed Daniel Sams 50(18) pic.twitter.com/dOwMkPxvDj
— Nishant Sharma🃏 (@srcsmic_enginer) April 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.