ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీని సాధించింది. శుక్రవారం బలమైన కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కేకేఆర్ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించి.. ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన SRH తర్వాత పుంజుకుని వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు ఇచ్చి.. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
అందులో మరీ ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేసిన బాల్ అయితే మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శ్రేయస్ అయ్యర్‌కు.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతికి కచ్చితమైన యార్కర్‌ను కళ్లు చెదిరే వేగంతో వేశాడు. ఆ బాల్ ఆడేందుకు అయ్యర్ దగ్గర సమాధానమే లేదు. దీంతో సూపర్ యార్కర్‌కు అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే 3 ఫోర్లు బాది ప్రమాదకారిగా మారుతున్న అయ్యర్‌ను ఉమ్రాన్ మాలిక్ అవుట్ చేయడంతో.. మైదానంలోని ఆటగాళ్లతో పాటు SRH డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. SRH పేస్ బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు.కూర్చున్న చోటు నుంచి SRH స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వద్దకు వచ్చి.. అతన్ని ఊపేస్తూ.. చూశావా నా కోచింగ్ ఎలా ఉందో.. నా శిష్యుడు అదరగొట్టేశాడు అన్నట్లు తన సంతోషాన్ని అతనితో సెలబ్రెట్ చేసుకున్నాడు. స్టెయిన్ లాంటి ఒక లెజెండ్.. ఉమ్రాన్ మాలిక్ లాంటి ఒక అన్‌క్యాప్డ్ బౌలర్ వికెట్ తీస్తే ఇంత సంతోషం వ్యక్తం చేయడంతో అతని సంబురాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కేవలం వేగాన్నే నమ్ముకున్న మాలిక్.. ఇప్పుడు కచ్చితమైన యార్కర్లు సంద్ధిస్తున్నాడంటే దాని వెనుక స్టెయిన్ కృషి ఎంతో ఉంది. అందుకే తన కష్టాన్ని, నమ్మకాన్ని ఉమ్రాన్ మాలిక్ నిలబెడుతుండడంతో స్టెయిన్ అంతలా సంతోషపడ్డాడు. మరి స్టెయిన్ సెలబ్రేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SRH వరుస విజయాలు! కావ్య పాపపై ఐరెన్ లెగ్ ముద్ర!
Dale Steyn’s reaction to Umran Malik’s yorker to Shreyas Iyer is 🔥 pic.twitter.com/ZtYjiI6pqt
— ChaiBiscuit (@Biscuit8Chai) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.