ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం(ఏప్రిల్ 12) సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న సీఎస్‌కే బ్యాటర్స్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. 7 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోర్ 37/2. ఇక.. రాబిన్ ఉతప్పకు, శివమ్ దూబే జత కలిశాడు. ఇక్కడినుంచి స్కోర్ బోర్డు స్వరూపమే మారిపోయింది. ఏ బాల్ వేస్తే కొట్టకుండా ఉంటారా అని ఆర్సీబీ బౌలర్లు తల పట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే.. ఏ రేంజ్ లో కొట్టారో అర్థం చేసుకోవచ్చు. చూస్తుండగానే 18.3 ఓవర్లలో స్కోర్ 200 మార్కును చేరుకుంది. చివరకి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప(88 పరుగులు 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సులు), శివమ్ దూబే(95 పరుగులు 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సులు).. ఇద్దరు నువ్ కొడితే.. నేను కొట్టనా అన్నంతగా చెలరేగిపోయారు.
Both of Them Deserves Century…🙁💔#CSKvsRCB #CSK𓃬 #IPL2022 pic.twitter.com/eod1EeBC2g
— HeᎥຮen多erg♦️ (@V_I_P_E_R__) April 12, 2022
Sooper Dubey! 🔥💪#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HYOvMVoy4X
— Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022
☎️Dial-in 8️⃣8️⃣ for Robin!#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/64F6j77GvH
— Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022
ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సక్సెస్ స్టోరీ!
ఇక.. ఐపీఎల్ 2002 సీజన్ లో ఆర్‌సీబీ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉంది. మరి సీఎస్‌కే నిర్ధేశించిన 216 పరుగుల లక్ష్యాన్నిఆర్‌సీబీ ఛేదిస్తుందో లేదో చూడాలి. ఇరజట్ల ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఎదురుపడగా సీఎస్‌కే అత్యధికంగా 18 సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
200+ in our 200th Match! Let’s go hold the fort!#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/jPX7mfu4gc
— Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022
Focus on the poster guys holding 🤣🤣#CSKvsRCB pic.twitter.com/sXYr7Gnj2s
— Rishabh Srivastava (@AskRishabh) April 12, 2022