ఐపీఎల్ 2022లో తొలి గెలుపు కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమయ్యాయి. తమ తొలి మ్యాచ్‌లో ఓడిన ఈ ఇరుజట్లు రెండో మ్యాచ్‌లో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. టోర్నీ ఆరంభంలో ఓటమితో కాస్త డీలా పడ్డా.. విజయంతో మళ్లీ పుంజుకోవాలని భావిస్తున్నాయి. మరి ఈ రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
ఈ జట్టు ప్రధాన బలం బ్యాటింగ్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, కాన్వే విఫలం అయ్యారు. టాప్ ఆర్డర్‌లో ఊతప్ప, మిడిల్దార్‌లో రాయుడు, ధోని, బ్రావో రాణిస్తే.. CSK మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో చాలా డెప్త్ ఉండడం చెన్నై కలిసొచ్చే అంశం. ఇక ఆ జట్టు స్టార్ ప్లేయర్ మొయిన్ అలీ కూడా ఈ మ్యాచ్‌తో జట్టుతో చేరితే చెన్నై మరింత బలంగా మారనుంది. ఇక బౌలింగ్‌లో చెన్నై అంత బలంగా కనిపించడం లేదు. పైగా ధోని కెప్టెన్‌గా లేకపోవడం చెన్నై పెద్ద మైనస్. కెప్టెన్‌గా జడేజా తడుబడుతుండడం తొలి మ్యాచ్‌లోనే కనిపించింది.
లక్నో సూపర్ జెయింట్స్..
పేపర్‌పై లక్నో టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. గ్రౌండ్‌లో మాత్రం అంత బలంగా కనిపించడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంతో ఉన్నా కూడా.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ లక్నో విఫలం అయింది. చెన్నైతో పోల్చుకుంటే లక్నో బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దుష్మంత చమీరాను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. అలాగే బ్యాటింగ్‌లో లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ రాణిస్తే భారీ స్కోర్ ఖాయం. అలాగే కెప్టెన్సీలో కేఎల్‌రాహుల్ చేస్తున్న తప్పిదాలు చెన్నైకు కలిసొచ్చే అవకాశం ఉంది.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబయిలోని బ్రబౌర్న్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 160-170 మధ్య పరుగులు చేసే అవకాశం ఉంది. అలాగే స్పిన్నర్లకు కొంత అనుకూలించే వీలుంది.
ప్రిడిక్షన్..
ఇరుజట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో సమవుజ్జీలుగా ఉన్నా.. బౌలింగ్‌లో లక్నో కొంత బలంగా కనిపిస్తుంది. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దుష్మంత చమీరా తమ ఫామ్‌ను కొనసాగించి.. ఆ జట్టు ప్రధాన బ్యాటర్లు రాహుల్, డికాక్ బ్యాట్ ఝుళిపిస్తే గెలుపు నల్లేరుపై నడకే.
తుది జట్లు అంచనా..
చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజా(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, శివమ్ దూబే, ధోని, అంబటి రాయుడు, ఆడమ్ మిల్నే, దేశ్ పాండే, బ్రావో, మిచెల్ సాంట్నర్.
లక్నో సూపర్ జెయింట్స్.. కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, కృనాల్ పాండ్యా, మనీష్ పాండే, దీపక్ హుడా, దుష్మంత్ చమీరా, మొహ్సీన్ ఖాన్, ఆయుశ్ బదోని, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్.
ఇదీ చదవండి: రాయుడు రనౌట్ కాకుంటే పరిస్థితి వేరుగా ఉండేది! జడేజాపై CSK ఫ్యాన్స్ ఫైర్
We stride out again tomorrow! 🦁#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/zPcNZ5KjfE
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.