టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2022లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటికే మూడు గోల్డెన్ డక్స్ కూడా అయ్యాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న కోహ్లీ.. ఏ సీజన్‌లో కూడా ఇంతలా ఇబ్బంది పడలేదు. పైగా కెప్టెన్సీ భారం దించేసుకున్న తర్వాత కూడా కోహ్లీ నుంచి ఇలాంటి ప్రదర్శనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ దృష్టా్య.. ఐపీఎల్ తర్వాత టీమిండియా సిరీస్‌లకు కూడా విశ్రాంతి ఇస్తారని, లేదు అసలు జట్టు నుంచే తప్పిస్తారనే వార్తలు హోరెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కోహ్లీ లాంటి ఆటగాడిని ఒక ఐపీఎల్ సీజన్‌లో కనబర్చిన ప్రదర్శనతో అతని కెరీర్‌ను ఎలా డిసైడ్ చేస్తారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఒక ప్లేయర్‌గా, ఒక కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టీమిండియాకు చేసిన సేవలు మరువలేనివి. విరాట్ కోహ్లీ ఆడినంత నిలకడగా ఆడిన ఆటగాడు ప్రస్తుత క్రికెట్‌లో ఎవరూ లేరంటే అతిశయోక్తికాదు. అంతటి టాలెంటెడ్ ప్లేయర్‌ను ఒక గజిబిజీ టోర్నీలో రాణించనంత మాత్రనా.. జాతీయ జట్టు నుంచి తప్పించడం అంటే గొప్ప ఆటగాడిని అవమానించడమే అవుతుందని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ వాదన వినిపిస్తున్నారు.
ప్రస్తుతం కోహ్లీ ఫామ్‌లో లేకపోవచ్చు.. కానీ అతను ఫామ్ అందుకుంటే జట్టును ఒంటిచేత్తో గెలిపించగలడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్నీతో పాటు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. ఆ తర్వాత అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించడంతో.. కోహ్లీకి, బోర్డు పెద్దలకు మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. ఇలా కోహ్లీకి, బీసీసీఐకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చాలా మంది క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022లో కోహ్లీ బ్యాడ్ ఫామ్‌ను సాకుగా చూపి టీమిండియా నుంచి తప్పించాలనే ప్రయత్నాలు బీసీసీఐ చేస్తున్నారనే వార్తలు రావడంతో కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియాలో అనుభవం అవసరం..
ఐపీఎల్ తర్వాత టీమిండియా వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల తర్వాత అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ వర్మ కూడా ఈ వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టాడు. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరిగే సిరీస్‌లకు దూరం పెడితే.. అతను ఫామ్ అందుకోవడం కష్టం అవుతుంది. ఒక వేళ టీ20 వరల్డ్ కప్‌కు కూడా కోహ్లీని పక్కన పెట్టే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ జరిగేది ఆస్ట్రేలియాలో. అక్కడి బౌన్సీ పిచ్‌లపై అనుభవం ఎంతో అవసరం. పైగా ఒత్తిడి తట్టుకుని బ్యాటింగ్ చేసే కోహ్లీ లాంటి ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే. అలా కాదని ఐపీఎల్‌లో ఫామ్ చూసి కుర్రాళ్లను ఆస్ట్రేలియా తీసుకెళ్లే బొక్కబోర్లా పడటం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీ కింగ్ లా కమ్‌బ్యాక్ చేస్తాడు! మద్దతు తెలిపిన టీమిండియా క్రికెటర్!
Like & Retweet if you Believe Virat Kohli will make comeback again @imVkohli pic.twitter.com/PripoNetCI
— KohliPanti (@KohliPanti) May 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.