ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం అత్యంత దారుణంగా ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఖాతానే తెరవలేదు. ఆడిన తొలి ఆరు మ్యాచ్‌లలో కూడా ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు.. అత్యధికంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టు ముంబై. అలాంటి ఘనమైన రికార్డు కలిగిన ముంబై ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతుంది. ప్రస్తుతం ముంబైకు ప్లేఆఫ్ చేరే అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారాయి. వాస్తవానికి ముంబై ప్లేఆఫ్స్‌కు చేరాడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
దీంతో రాబోయే మ్యాచ్‌లలో తమ జట్టులోని యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చి.. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కూడా.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కుర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కుర్‌కు తుది జట్టులో స్థానం కల్పిస్తే బాగుండదని అభిప్రాయపడ్డాడు. ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కూడా బెంచ్‌కు పరిమితం అయిన యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో అర్జున్ టెండూల్కుర్ ఐపీఎల్ అరంగేట్రం వచ్చే మ్యాచ్‌లో జరిగే అవకాశం ఉందని సమాచారం.ఈ విషయంపై సచిన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ టెండూల్కుర్ ఆట చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా అర్జున్ టెండూల్కుర్ పేస్ బౌలర్. అతన్ని ముంబై ఐపీఎల్ మెగా వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా సచిన్ కూడా ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్నాడు. మరి ఈ అర్జున్ టెండూల్కుర్ రాకతోనైనా ముంబై ఇండియన్స్ రాత మారుతుందేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022లో తొలి హ్యాట్రిక్! ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్న చాహల్
#MIvLSG on our minds! 🧠#OneFamily #DilKholKe #MumbaiIndians #ArjunTendulkar pic.twitter.com/8X6ltPQEuf
— Mumbai Indians (@mipaltan) April 15, 2022
Father Sachin Tendulkar and his son Arjun Tendulkar in the dugout. pic.twitter.com/BWJ8qtfrOg
— CricketMAN2 (@ImTanujSingh) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.