ఐపీఎల్ 2021 రెండో దశ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయంతో ఏకంగా నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లతో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. రాయల్స్ కెప్టెన్ శాంసన్ 82 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 18.3 ఓవర్లతో కేవలం 3 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం నాలుగు జట్లకు కల్పించి టోర్నీని ఆసక్తి కరంగా మార్చేసింది ఎస్‌ఆర్‌హెచ్. ప్రతి టీమ్ తలా 10 మ్యాచ్‌లు ఆడేశాయి.
ఇప్పటికే చెన్నై, ఢిల్లీ 8 మ్యాచ్‌లలో గెలిచి 16 పాయింట్లతో టాప్ 1, 2లో ఉన్నాయి. 3వ స్థానంలో ఆర్సీబీ 12 పాయింట్లతో ఉంది. చెన్నై, ఢిల్లీ అధికారికంగా ప్లేఆఫ్ చేరకున్నా దాదాపు ఖాయం అయినట్లే. ఇక ఆర్సీబీ 2 మ్యాచ్‌లు గెలిస్తే దాదాపు ఆ జట్టు కూడా ప్లేఆఫ్‌కు చేరినట్లే. ఇక మిగిలింది ఒక్క స్థానం పోటీ మాత్రం 4 జట్ల మధ్య. కోల్‌కత్తా, పంజాబ్, రాజస్థాన్, ముంబై ఈ నాలుగు జట్లు తలా 10 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌లలో గెలిచి 8 పాయింట్లతో వరుసగా ఉన్నాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా కోల్‌కత్తా మెరుగైన స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ జట్లకు. ఒక్క ఎస్‌ఆర్‌హెచ్ మాత్రమే ప్లేఆఫ్ రేసులో లేదు. కానీ మిగతా జట్ల అవకాశాలపై మాత్రం ప్రభావం చూపగలదు.
మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో హైదరాబాద్ గెలుపైనా, ఓటమైనా ఏదో ఒక జట్టుకు నష్టమో, లాభమో చేస్తుంది. ఈ సారి పోటీ మాత్రం తారాస్థాయికి చేరింది. అన్ని జట్లు 10 మ్యాచ్‌లు ఆడినా కూడా ఇంకా ప్లేఆఫ్‌కు ఒక్క జట్టు కూడా అధికారికంగా వెళ్లకపోవడం చూస్తే తెలుస్తుంది ఐపీఎల్ అంటే ఏంటో.. టాప్‌లో ఉన్న రెండు జట్లు కూడా కచ్చితంగా ప్లేఆప్‌కు చేరతాయని చెప్పలేం. 7 జట్లలో ఎవరైనా ప్లేఆఫ్‌కు చేరొచ్చు.
🙌🙌🙌#SRHvRR #VIVOIPL https://t.co/TN3tS5tx56 pic.twitter.com/ZiKBBT1MuW
— IndianPremierLeague (@IPL) September 27, 2021