పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజుమామ్-ఉల్-హక్ గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా గుండెలో నొప్పి వస్తుండగా సోమవారం ఆయన లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వివిధ టెస్టులు చేసిన అనంతరం ఆయనకు హార్ట్ ఎటాక్‌కు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. 51 ఏళ్ల ఇంజుమామ్-ఉల్-హక్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సెల్‌టెంట్‌గా, 2016-19 మధ్య కాలంలో చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే అఫ్టనిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.