‘ఇంజమామ్ ఉల్ హక్‘ ఈ తరానికి ఈ పేరు తెలియకపోయినా, 90’s కిడ్స్ కు ఈ క్రికెటర్ బాగా సుపరిచితం. అలా అని పరిచయం కాదండోయ్.. టీవీల్లో చూస్తూ ఆరాధించేవారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇంజమామ్, ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా పాక్ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. చూడటానికి ఎంతో బబ్లీగా ఉండే ఇంజిమామ్ ఉల్ హక్ అలవోకగా సిక్సులు బాదేవాడు. స్టెపౌట్ అయ్యాడు అంటే బాల్ బౌండరీకి చేరాల్సిందే అన్న రీతిలో అతని బ్యాటింగ్ సాగేది. కాకపోతే ఇంజమామ్ ఆటలో ఒకటే చిన్న లోపం ఉండేది.. రన్నింగ్ చేసేందుకు ఇష్టపడేవాడు కాదు. ఆనాటి ఇంజమామ్ మరోసారి తన బ్యాటింగ్ విన్యాసాలను చూసే అవకాశం అభిమానులకు కల్పించాడు.
పాకిస్తాన్‌లో మెగా స్టార్స్ లీగ్ పేరిట టీ10 లీగ్ జరుగుతోంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇంజమామ్ కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఆ జట్టుకు సారధి మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది. టోర్నీలో భాగంగా బలోచ్ వారియర్స్ తో జరిగిన మ్యాచులో ఇంజమామ్ చెలరేగి ఆడారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులు చేశారు. ఈ క్రమంలో అతడు స్టెపౌట్ అయ్యి కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది. 52 ఏళ్ల వయసులోనూ అతడి పవర్‌హిట్టింగ్ చూసి అభిమానులు అలా చూస్తూ ఉండిపోయారు. డగౌట్‌లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్ షాట్‌కు ఆశ్చర్యపోయాడు.
Inzi Bhai scores 29 of just 16 and becomes the cricketainer of the day.#KingdomValleyMSL2022 #MSL #KingdomValleyMSL#MegaStarsLeague #Cricketainment #KingdomValley#CricketLeague #Cricket #ShahidAfridi #mediasniffers#Pakola #Daikin #Pindi #islamabad #InzimamUlHaq pic.twitter.com/EdkQVg6GmL
— Mega Stars League (@megastarsleague) December 19, 2022
1991లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన ఇంజమామ్ .. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాడిగా నిలిచాడు. 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే ఉంది. టెస్ట్ క్రికెట్‌లో సైతం 120 మ్యాచుల్లో 8829 పరుగులు చేసిన ఇంజమామ్, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పాక్ ఆటగాళ్లల్లో మూడో స్థానంలో నిలిచాడు. 2007లో ఇంజమామ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత కూడా.. ఆయన పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించాడు. పలు ముఖ్యమైన పదవులను సైతం నిర్వహించారు. ‘ఇంజమామ్ ఉల్ హక్’ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.