ఓ ఆటగాడిని ప్రపంచం గుర్తుపెట్టుకుంది అంటే అతడి ఆటే కారణం. కానీ అదే ఆటగాడిని ప్రపంచం మెుత్తం గుండెల్లో పెట్టుకుంది అంటే అతడు ఇంకేదో మాయ చేశాడని అర్థం. అలాంటి మాయే చేశాడు ఫుట్ బాల్ దిగ్గజం పీలే. సాకర్ ప్రపంచాన్ని తన ఆటతో మెస్మరైజ్ చేస్తూ.. ఆటకే అందాన్ని తీసుకోచ్చాడు. పీలే ఆట చూశాకే సాకర్ కు ‘బ్యూటిఫుల్ గేమ్’ అనే పేరొచ్చిందంటేనే ఆటగాడిగా అతడి స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆటగాడిని ఈ ప్రపంచం కోల్పోయింది. సుదీర్ఘకాలంగా పేగు క్యాన్సర్ తో పోరాడుతున్న పీలే(82) గురువారం అర్దరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో ఒక్కసారిగా క్రీడాలోకం దిగ్భ్రాంతికి లోనైంది. అయితే పీలే గురించి ఎవ్వరికీ తెలియని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే? పీలే ఆట కోసం ఓ యుద్ధాన్నే తాత్కాలికంగా రద్దు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు. కానీ వారిలో ఆటకే అందాన్ని తెచ్చిన క్రీడాకారులు చాలా తక్కువ మంది. క్రికెట్ కు సచిన్.. టెన్నిస్ కు ఫెదరర్.. సాకర్ కు పీలే. ఈ ముగ్గురు వారివారి ఆటల్లో ఆటకు అందాన్ని తెచ్చారు. ఇక చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన పీలే.. నమ్మశక్యం కానీ ఘనతలను సాధించి వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. ఫుట్ బాల్ లో దూకుడైన ఆటతో, అంతకంటే అద్భుతమైన క్రీడాస్ఫూర్తితో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు ఈ బ్రెజిల్ దిగ్గజం. ఇప్పుడంటే మెస్సీ, రొనాల్డో మరికొందరి పేర్లు అంటున్నారు గానీ పీలే ఆడే సమయంలో సాకర్ వరల్డ్ లో వినిపించే పేరు ఒక్కటే.. అదే పీలే. పీలే ఆటకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిపే ఒకేఒక్క సంఘటన గురించి మీకు ఇప్పుడు చెబుతాను.
RIP Pele.
The first GOAT. pic.twitter.com/NXXiHmkuqU
— Barstool Sports (@barstoolsports) December 29, 2022
అది 1969 ఆ సమయంలో నైజీరియాలో భీకరమైన అంతర్యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలోనే సావోపోలో క్లబ్ శాంటోస్ కు నైజీరియాకు చెందిన స్టేషనరీ స్టోర్స్ ఎఫ్ సీ కి మధ్య ఓ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ అంతర్యుద్దం కారణంగా అందరు మ్యాచ్ జరగదని అనుకున్నారు. కానీ పీలే ఆట కోసం యుద్దాన్ని 48 గంటలు అంటే 2 రోజులు వాయిదా వేశారు. అప్పట్లో ఈ సంఘటన వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది. ఈ ఒక్క సంఘటనే పీలే ఎంతటి ఆటగాడో తెలియజేసింది. ఇక ఈమ్యాచ్ లో ఇరు జట్లు 2-2 గోల్స్ చేసి మ్యాచ్ ను డ్రా గా ముగించాయి. కేవలం ఒకే ఒక ఆటగాడి ఆటను చూడటం కోసం యుద్ధాన్నే నిలిపివేశాయి అంటే సాధారణమైన విషయం కాదు. చరిత్రలో ఎంతో మంది విజేతలు ఉండొచ్చు కానీ పీలే లాంటి యోధుడు మాత్రం చాలా అరుదనే చెప్పాలి.
A inspiração e o amor marcaram a jornada de Rei Pelé, que faleceu no dia de hoje.
Amor, amor e amor, para sempre.
.
Inspiration and love marked the journey of King Pelé, who peacefully passed away today.Love, love and love, forever. pic.twitter.com/CP9syIdL3i
— Pelé (@Pele) December 29, 2022