ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్-2022 క్రీడల్లో భారత్ బోణి కొట్టింది. భారత్ తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో 55 కేజీల విభాగంలో పోటీ పడిన సంకేత్ సార్గర్ రజత పతకాన్ని గెలుపొందాడు. మొత్తం 248 కిలోలు ఎత్తి ఈ ఘనత సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్ కస్డాన్ మొత్తం 249 కిలోలు ఎత్తి స్వర్ణం సాధించగా.. శ్రీలంకకు చెందిన దిలంక కుమారా 225 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం అందుకున్నాడు.
సంకేత్ సార్గర్ మొదటి ప్రయత్నంలో 135 కేజీల బరువు ఎత్తి పతక రేసులో నిలిచాడు. కానీ, రెండో ప్రయత్నంలో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డాడు. అయినప్పటికి మూడో అటెంప్ట్ కోసం ట్రై చేశాడు. కానీ మోచేతి గాయం నొప్పికి తాళలేక పోయాడు. దీంతో సంకేత్ సార్గర్ రజత పతకంతో సరిపెట్టాడు. నాలుగేళ్ల క్రితం ఓ సాధారణ వ్యక్తిగా పాన్ అమ్మినా సంకేత్ సార్గర్.. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కి పతకం సాధించి పెట్టాడు.
ఒకప్పుడు సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించిన సంకేత్.. ఇప్పుడు దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు. సంకేత్ ను ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరి.. పాన్ అమ్మే స్థాయి నుంచి దేశానికి పతాకం తెచ్చే స్థాయికి ఎదిగిన సాకేత్ సార్గర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs PAK: కామన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్! ఈ ఛానెల్‌లో లైవ్
ఇదీ చదవండి: కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాకు దక్కని శుభారంభం! ఆకట్టుకున్న రేణుక