ఇండియన్ ఉమెన్స్ టీమ్ అదరగొట్టేసింది. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 216 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. మేఘనా సింగ్ పూజా వస్త్రాకర్ తలా రెండు వికెట్లు, దీప్తీ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, డియోల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో నీలాక్షి డి సిల్వా 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ (75), పూజా వస్త్రాకర్(56) పరగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర, రష్మీ డి సిల్వా, ఆటపత్తు చెరో రెండు వికెట్లు సాధించగా, కాంచనా,రణసింఘే, కవిషా దిల్హరి తలా వికెట్ సాధించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు హర్మన్‌ప్రీత్ కౌర్‌కే దక్కాయి. టీమిండియా సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India eyes a 3-0 sweep in the ODI series vs Sri Lanka
Asked to bat by Chamari Athapaththu, this in-form opening pair is off to a steady start. Can Sri Lanka nip this stand in the bud? #SLvIND LIVE coverage 👉https://t.co/o5JR0cvduQ pic.twitter.com/hJbQyzWimL
— Sportstar (@sportstarweb) July 7, 2022