ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను ఇండియన్ ఉమెన్స్ టీమ్ సాధించింది. నిజానికి వన్డే క్రికెట్‌లో ఇదో చరిత్రగా నిలిచిపోవడం ఖాయం. 174 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి రికార్డు సృష్టించారు. మహిళల క్రికెట్‌లో ఇంతవరకు ఈ ఘనత ఎవరూ సాధించలేదు. శ్రీలంక నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(71 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 నాటౌట్), స్మృతి మందాన(83 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 94 నాటౌట్) ఈ ఘనతా సాధించారు.
సోమవారం పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన లంక టీమిండియా బౌలర్ రేణుకా సింగ్ దెబ్బకు లంక బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. 10 ఓవర్లు వేసిన రేణుకా కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. మేఘనా సింగ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. లంక బ్యాటర్లలో కంచనా(47 నాటౌట్) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. నీలాక్షి డిసిల్వా(32) కాస్త పర్వాలేదనిపించింది. దీంతో లంక నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మందాన 174 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. కేవలం 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఫినిష్ చేసి వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించారు. కాగా 1997లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 164 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును ఇండియన్ ఉమెన్స్ టీమ్ బద్దలుకొట్టింది. అలాగే 2006లో శ్రీలంకపైనే భారత్ 146 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది.
వికెట్ కోల్పోకుండా ఛేదించిన టాప్ 5 లక్ష్యాల్లో 174 పరుగుల లక్ష్యఛేదనతో భారత్ మొదటిస్థానంలో, 164, 163 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, 147 పరుగుల లక్ష్యఛేదనతో నెథర్‌లాండ్స్ నాలుగో స్థానంలో, 146 పరుగుల లక్ష్యఛేదనతో భారత్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక శ్రీలంకను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన రేణుకా సింగ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. మరి మన అమ్మాయిలు సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It’s power of Our indian womens Cricket team.. defeate the Sri Lanka women’s cricket. #SkyExchCricket pic.twitter.com/4SyokLEmUn
— Sheet (@Sheet0_) July 4, 2022
The Indian women created history last night 👏
How it happened ➡️ https://t.co/QAAvjJgujx#INDvSL pic.twitter.com/3iNMGXSbN7
— ICC (@ICC) July 5, 2022
⚡ TOP-NOTCH! Renuka Singh registered her best ODI figures today with her 4-fer. This is the best bowling figures for her in any format.
📷 BCCI • #INDvSL #SLWvINDW #TeamIndia #BharatArmy pic.twitter.com/HiN1bnqyVX
— The Bharat Army (@thebharatarmy) July 4, 2022