భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణీ మరో ఘనత సాధించాడు. మంగళవారం జరిగిన ఐబీఎస్‌ఎఫ్ 6 రెడ్ స్నూకర్ ప్రపంచకప్‌లో విజతేగా నిలిచాడు. ఈ టైటిల్‌తో పంకజ్ ఖాతాలో 24 ప్రపంచ టైటిళ్లు చేరాయి. పాకిస్థాన్ క్యూయిస్ట్ బాబర్‌పై 7-5 (42–13, 14–38, 53–0, 42–19, 1–53, 47–17, 44–0, 36–3, 0–43, 12–46, 15–59, 53–5) ఫ్రేమ్‌ల తేడాతో పంకజ్ అడ్వాణీ విజయం సాధించాడు. మొదటి ఇది పంకజ్‌కు సునాయాస విజయమే అనుకన్నా.. బాబర్ బ్యాక్ టు బ్యాక్ 3 ఫ్రేమ్‌లు గెలిచి ఒకింత గట్టి పోటీ ఇచ్చాడు.
ఆఖరి ఫ్రేమ్‌లో 53-5 తేడాతో పంకజ్ అడ్వాణీ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. గతవారం పంకజ్ తన కెరీర్‌లో 11వ ఆసియా టైటిల్‌ను గెలిచాడు. ఈ వారం ఐబీఎఎస్‌ఎఫ్ 6 రెడ్ స్నూకర్ ప్రపంచకప్ టైటిల్ గెలవడం పట్ల పంకజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘చాలా కాలం టేబుల్‌కు దూరంగా ఉన్నా.. ఇలా వెంట వెంటనే టైటిళ్లు గెలవడం నాలో ఉత్సహాన్ని, గెలవాలనే కసిని పెంచాయి. దేశానికి రెండు టైటిళ్లు అందించడం ఆనందంగా ఉంది’ అని పంకజ్ తెలిపాడు. పంకజ్‌కు రెడ్ స్నూకర్ టైటిల్ ప్రైజ్ మనీగా 12 వేల డాలర్లు (రూ. 8 లక్షల 84 వేలు) దక్కాయి.
Pankaj Advani conquers Qatar 6Reds World Cup 2021. Won back to back two major International titles.https://t.co/ctbn75dQWj pic.twitter.com/xJIYKnhtTq
— IBSF (@ibsf) September 21, 2021