ప్రస్తుతం సీనియర్ ప్లేయర్ల టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్ అయిన టెస్టు మ్యాచ్ ఒకటి ఆడనుంది. అది గెలిస్తే ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుస్తుంది. కానీ ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియా గట్టి షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడి ఇంకా కోలుకోని విషయం విధితమే. అయినా కూడా భారత ఆటగాళ్లు షాపింగ్‌లకు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బయటికి వెళ్లి అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు.
ఇప్పటికే రోహిత్ శర్మ కరోనాతో ఐసోలేషన్‌లో ఉంటే.. జాగ్రత్తలు పాటించకుండా ఈ తిరుగుళ్లు ఏంటని బీసీసీఐ ఇప్పటికే టీమిండియా ఆటగాళ్ల మందలించింది. ఇకపై బయటికి వెళ్లడానికి, పబ్లిక్‌తో ఫొటోలు దిగడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్‌తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడితే సిరీస్ ఎక్కడ నిలిచిపోతుందో అనే భయంతో బీసీసీఐ ఆటగాళ్లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. కానీ.. టీమిండియా ఆటగాళ్లు మాత్రం బీసీసీఐ మాటలను ఏ మాత్రం లెక్కచేయడంలేదని తెలుస్తుంది. మంగళవారం ఆటగాళ్లంతా ఒక రెస్టారెంట్‌కు వెళ్లి పార్టీ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్లేయర్లపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి.
ఇప్పటికే కెప్టెన్ కరోనాతో పడుకుంటే మీ కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇలా తిరుగుతారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో బయోబబుల్, కరోనా నిబంధనలు లేవు. దీంతో ఆటగాళ్లుకు పూర్తి స్వేచ్చ దొరికింది. కానీ.. ఇప్పుడిప్పుడే అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడం.. రోహిత్ ఆల్‌రెడీ కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా వారి ప్రవర్తనలో మార్పు రావడంలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli, Rishabh, Shreyas, Gill, Shardul, Siraj, Saini and Kamlesh Nagarkoti visit to the restaurant in Birmingham. pic.twitter.com/l6fEBDe5UN
— CricketMAN2 (@ImTanujSingh) June 28, 2022