ఇంగ్లాండ్, బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. రోజువారీ పోటీల్లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే పట్టు కోల్పోయిన మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా అదే పాత్ లో వేగంగా రావడంతో మీనాక్షిపై దూసుకెళ్లింది.
దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ANOTHER huge crash at the #CommonwealthGames saw a #.cyclist RUN OVER by a rival.
The horror incident in the Women’s 10km Scratch Race saw India’s #Meenakshi fall from her bike before sliding down the banking on the bend#CommonwealthGames2022#CWG2022India#India4CWG2022#CWG22 pic.twitter.com/2MfJL5MweY— Kulwinder Kaur Mohabbat کلوندر کور محبت (@Kulwinderk28696) August 1, 2022
Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82
— Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022