టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం పంత్ ముంబై లోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పంత్ మోకాలికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూజిలాండ్ తో సిరీస్ లోని చివరి వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం ఉజ్జయినీ మహాకాళీ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ వన్డే సిరీస్ తో బిజీ బిజీగా ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మ్యాచ్ అయిన చివరి వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ వెళ్లింది. మంగళవారం ఈ మ్యాచ్ జరగనుండటంతో ఆటగాళ్లకు కొంత సమయం లభించింది. ఈ సమయాన్ని తమ టీమ్ మెట్ అయిన రిషభ్ పంత్ కోసం వినియోగించారు. టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు సోమవారం మధ్యప్రదేశ్ లోని ప్రముఖ ఆలయం అయిన ఉజ్జయినీ మహాకాళీ ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ పూజలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనంతరం మీడియాతో మాట్లాడాడు సూర్యకుమార్. మా స్నేహితుడు రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఈ రోజు మేం ప్రత్యేక పూజలు చేశామని సూర్య అన్నాడు. అతడు జట్టులోకి రావడం టీమిండియా ఎంతో అవసంర అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక న్యూజిలాండ్ పై ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచామని, చివరి వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు మిస్టర్ 360 ప్లేయర్. మరి రిషభ్ పంత్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన టీమిండియా క్రికెటర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Madhya Pradesh | Indian cricketers Suryakumar Yadav, Kuldeep Yadav, and Washington Sundar visited Mahakaleshwar temple in Ujjain and performed Baba Mahakal’s Bhasma Aarti. pic.twitter.com/nnyFRLMbfa
— ANI (@ANI) January 23, 2023