శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా- 2022 రెండో టీ20లో అద్భుత విజయంతో సిరీస్ ను సొంతం చేసుకుంది. కేవలం 17.1 ఓవర్లలోనే 184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం నమోదు చేసింది. అయితే ఈ సరీస్ గురించి పక్కన పెడితే ఏ ముహూర్తాన ఇది మొదలైందో గానీ, అప్పటి నుంచి టీమిండియాలో ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయాల పాలవుతున్నారు. తాజాగా ఇషాన్ కిషన్ తలకు గాయం అయ్యింది. ఇంకో టీ20, రెండు టెస్టులు మిగిలున్నాయి ఈలోగా ఇంకెంత మందికి గాయలవుతాయో అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సిరీస్ ప్రారంభానికి ముందే రాహుల్, అక్షర్ పటేల్, సూర్యకుమార్, దీపక్ చాహర్ సిరీస్ కు దూరం అయ్యారు. సిరీస్ ప్రారంభం అయ్యాక మొదటి టీ20 తర్వాత రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకొన్నాడు. ఇప్పుడు ఓపెనర్ ఇషాన్ కిషన్ తలకు గాయం అయ్యింది. మ్యాచ్ 4వ ఓవర్లో లాహిరు 147.6 కిలో మీటర్ల వేగంతో వేసిన బౌన్సర్ ను ఇషాన్ అడ్డుకోబోగా అది అతని హెల్మెట్ ను తాకింది. వెంటనే క్రీజు నుంచి పక్కకు వెళ్లి హెల్మెట్ తీసి చూసుకున్నాడు. వెంటనే వచ్చి ఫిజియో కూడా పరీక్షించాడు. పెద్దగా ప్రభావం లేదని ఆటను కొనసాగించాడు.
ఆ తర్వాత 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వెంటనే ఇషాన్ ను కంగ్రాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి సీటీ స్కాన్ చేశారు. రిపోర్ట్స్ ఆదివారం వస్తాయని తెలిపారు. గాయం తీవ్రం కాకపోతే మంచిదే. కానీ, ప్రభావం అధికంగా ఉంటే సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు రోహిత్- మయాంక్ అగర్వాల్ మ్యాచ్ ఓపినింగ్ కు వస్తారు. ఇదే మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు చండిమల్ కూడా గాయపడ్డాడు. అతను కూడా బొటనవేలికి గాయంతో కంగ్రా ఆస్పత్రిలో చేరాడు. ఇది గాయాల సిరీస్ అని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Sports Hustle (@SportsHustle3) February 26, 2022