దొంగలు, తెలివిగల దొంగలు. ఇక్కడ రెండు రకాలు ఎందుకు చెప్పాలంటే.. దొంగలనుకోండి.. కాలే కడుపుకు ఏదో ఒకటి అన్నట్లుగా దొరికింది ఎత్తుకెళ్తారు. అదే.. తెలివిగల దొంగలు అయితే.. ఎక్కడ దొంగతనం చేయాలో? ఏది ఎత్తుకెళ్లాలో? ముందే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. మన కథలో అలాంటి దొంగ ఒకడు తన పనితనాన్ని చూపించాడు. ఎవరు దొరకనట్టు.. టీమిండియా క్రికెటర్ పర్స్ ఎత్తుకెళ్లాడు. అది కూడా ఆమె పర్సనల్ రూములోకి వెళ్లి ఎత్తుకెళ్లాడు. ఆ వివరాలు..
ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత మహిళల జట్టు టీ20 సిరీస్‌ని 2-1తో కోల్పోయినప్పటికీ, వన్డే సిరీస్‌ని మాత్రం 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇక పర్యటన ముగియడంతో నేడు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ఈ క్రమంలో భారత మహిళా వికెట్ క్రికెటర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. తన పర్సును ఎవరో కొట్టేశారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.. తానియా. అంతేకాదు.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును కూడా ఏకిపారేసింది.
“లండన్ మైదా వాలే మారియట్ హోటల్ మేనేజ్‌మెంట్ నన్ను షాక్‌కి గురి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టుతో ఉన్న సమయంలో నా పర్సనల్ రూంలోకి ఎవరో వచ్చి నా బ్యాగు దొంగిలించారు. అందులో కార్డులు, డబ్బు, వాచీలు, విలువైన జ్యూవెలరీ కూడా ఉన్నాయి. ఇది ఏ మాత్రం సురక్షితం కాదు.. ఈ ఘటనపై విచారణ చేసి నా బ్యాగును తిరిగి నాకు అందిస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అనుకోలేదు..” అంటూ తానియా వరుస ట్వీట్లు చేసింది.
2/2 Hoping for a quick investigation and resolution of this matter. Such lack of security at @ECB_cricket‘s preferred hotel partner is astounding. Hope they will take cognisance as well.@Marriott @BCCIWomen @BCCI
— Taniyaa Sapna Bhatia (@IamTaniyaBhatia) September 26, 2022
వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్ వివాదాస్పదంగా ముగిసిన సంగతి తెలిసిందే. దీప్తి శర్మ మన్కడింగ్(రనౌట్)తో సిరీస్ ని ముగించింది. ఇది నచ్చక.. ఎవరో కావాలనే ఈ పనికి పాల్పడి ఉంటారని భారత అభిమానులు అనుమానిస్తున్నారు. టీమిండియా గెలవడాన్ని తట్టుకోలేక ఇంగ్లాండ్ అభిమానులు ఈవిధంగా చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. లండన్‌లో పోయిన వస్తువులు తిరిగి మ్యూజియంలోనే దొరుకుతాయని, అప్పుడు కోహినూర్ డైమండ్‌ని కొట్టేసి మ్యూజియంలో దాచినట్టే.. తానియా పర్సు కూడా ఎప్పుడో ఒక్కప్పుడు అక్కడికి చేరుతుందని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.