టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రీజులో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటాడు. కామెడీ వీడియోస్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా శిఖర్ ధావన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అతడి ఫ్యాన్స్ పాపం శిఖర్ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో శిఖర్ ధావన్ ఓ పెద్దాయన చేత చెంప దెబ్బ తిన్నాడు. జోక్ చేయబోయి.. ఇలా అవమానం పొందాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈసారి శిఖర్ ధావన్ యాక్షన్, కామెడీ కలగలిపిన చిన్న వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. ఇందులో శిఖర్ధావన్ తన తండ్రితో కామెడీ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన శిఖర్ ధావన్ చెంప చెళ్లుమనిపించారు. అయితే ఇదంతా సరదా కోసం తీసిన వీడియోనే అయినప్పటికి ధావన్ తండ్రి మాత్రం చాలా సీరియస్ గా కనిపించడంతో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
ఇది కూడా చదవండి : క్రికెట్ లో అరుదైన ఘటన! ఒకే జట్టులో తండ్రి-కొడుకు!
ఈ వీడియో.. తన గదిలోంచి బయటకు వస్తున్న శిఖర్ ధావన్ తండ్రి ఏంటీ లోపల తిరుగుతున్నావు అని సీరియస్ గా పంజాబీ భాషలో ప్రశ్నించాడు. మీ దగ్గర వారెంట్ ఉందా.. మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అంటూ సీరియస్ గా బదులివ్వడంతో ధావన్ని ఆయన తండ్రి చెంపపైన ఒక దెబ్బ కొట్టి పో లోపలికి పో అంటూ తిట్టారు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన ధావన్.. దెబ్బ తిన్న చెంపపై పెట్టుకొని.. తల దించుకుని ఏం మాట్లడకుండా గదిలోకి వెళ్లిపోయాడు. నాన్న ఎప్పటికి నాన్నే అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ వీడియో చాలా ఫన్నీగా ఉండటంతో ఇప్పటికే నాలుగు లక్షల మంది దీన్ని చూశారు. మూడు వేల మందికిపైగా కామెంట్స్ పోస్ట్ చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ తన తండ్రితో తీసిన ఈ ఫన్నీ మూమెంట్పై భారత మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మెచ్చుకుంటూ బెస్ట్ అని కామెంట్ చేయగా.. ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ స్మైలీ ఎమోజీ షేర్ చేశాడు. క్రికెటర్లే కాదు బాలీవుడ్ హీరోలు ఆయుష్మాన్ ఖురానా, హుమా ఖురేషి సైతం ఈ వీడియోపై డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు.