టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ టీమిండియాలో ధోని స్థానాన్ని పూర్తిస్థాయిలో భర్తీ చేసే ఆటగాడు లేడనే చెప్పాలి. క్రికెట్ అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. అందుకే ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన టెస్టు మ్యాచ్‌లో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ‘మే ధోనిని మిస్ అవుతున్నాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా టీమిండియాలో ధోని లేని లోటు పూడ్చలేనిదంటూ అభిప్రాయపడుతున్నారు.
టెస్టు క్రికెట్ నుంచి ధోని తప్పుకుని ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఫ్యాన్స్ ఇంకా ధోనిని మిస్ అవుతున్నారంటే ధోని ఇండియన్ క్రికెట్‌ను ఎంతలా ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆటగాడిగా ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని టీమిండియా మరుపురాని విజయాలు అందించాడు. అలాగే కెప్టెన్‌గా టీమిండియాను విజయవంతంగా నడిపించిన ధోని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన నాయకత్వ పటిమతో టీమిండియాకు ఒక భరోసాలా కనిపించేవాడు.
మైదానంలో ఎంతటి కఠిన పరిస్థితి ఎదురైనా కూడా సహనం కోల్పోకుండా చాలా కూల్ పరిస్థితులను చక్కదిద్దేవాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడానికి, ఫీల్డింగ్‌లో పరుగులు ఆపడానికి ఇండియన్ క్రికెటర్లు బద్దకిస్తారనే అపవాదును తొలగించిన కెప్టెన్ ధోని. ఇలా తన కెప్టెన్సీతో టీమిండియా రూపరేఖలను మార్చిన లీడర్‌గా ధోని పేరు ఇండియన్ క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ.. ప్రస్తుతం టీమిండియాలో ఒక విధమైన గందరగోళం, కెప్టెన్సీలో అనిశ్చితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయాన్ని గుర్తుకు తెచ్చుకుని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇలా మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆవేదన చెందుతున్నారు. వీరిలో చాలా మంది ధోని ఆటను మిస్ అవుతున్న వాళ్లే. కాగా ధోని తన కెరీర్‌లో మొత్తం 90 టెస్టులు ఆడి 144 ఇన్నింగ్స్‌లలో 4876 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ధోని కెప్టెన్సీలో టీమిండియా 55 టెస్టులు ఆడింది. అందులో 27 విజయాలు, 17 ఓటములు ఉన్నాయి. 14 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WE MISS MSD 💛 pic.twitter.com/HBY74qUHLJ
— CSK Fans Army™ (@CSKFansArmy) July 1, 2022