దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్సీ వైఫల్యం అంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు మరో విషయాన్ని ఎక్కువగా ఎత్తిచూపుతున్నారు.
కేఎల్ రాహుల్ చాలా ఈగో చూపించాడని.. మ్యాచ్‌లో వ్యూహాలు రచించే సమయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సలహాలు తీసుకోవాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విరాట్ కోహ్లీ జట్టులో చాలా సీనియర్ ప్లేయర్, మరీ ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్.. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా టీమిండియాను ముందుకు నడిపించిన సారథి. అంతటి అనుభవాన్ని జట్టులో పెట్టుకుని కూడా కెప్టెన్‌గా రాహుల్ ఉపయోగించుకోలేపోయాడు.
KL Rahul when Virat Kohli was giving him captaincy tips. pic.twitter.com/nRa8XxDcAQ
— | Punjabi Mourinho ☬ | (@Punjabi_Mou) January 19, 2022
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ బవుమా, డస్సెన్ అద్భుతంగా ఆడుతూ భారీ భాగస్వామ్యం నిర్మిస్తున్నారు. ఈ సమయంలో భారత బౌలర్లు ఈ జోడిని విడదీయడానికి తీవ్రంగా శ్రమించారు. ఇలాంటి పరిస్థితుల్లో.. విరాట్ కోహ్లీతో సంప్రదింపులు జరిపి.. రాహుల్ బౌలర్లను వ్యూహాత్మకంగా ప్రయోగించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ కేఎల్ రాహుల్ అలాంటి ప్రయత్నం చేయలేదు.
egoist kl rahul#INDvsSA #viratkholi
— Sayyad Nag Pasha (@PashaNag) January 20, 2022
విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన కొత్తలో అప్పటి మాజీ కెప్టెన్ ధోనితో మాట్లాడి మంచి ఫలితాలు రాబట్టే వాడు. అగ్రెసివ్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకున్న కోహ్లీనే ఈగో చూపెట్టకుండా.. ధోనితో కలిసి వ్యూహాలు రచించినప్పుడు రాహుల్ ఎందుకు అలా చేయలేకపోయాడు అని నెటిజన్ల ఉద్దేశం. మరి రాహుల్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ind Vs SA: తొలి వన్డే ఓటమితో టార్గెట్ అయిన కేఎల్ రాహుల్!