ఏ దేశాల మధ్య జరిగినా.. ఆయా దేశాల మధ్య క్రికెట్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కానీ.. తొలి సారి భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌పై మండిపడుతున్నారు. వారి కోపానికి కారణం ఐసీసీ చేసిన పొరపాటే.
ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)పై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఐసీసీపై ట్రోలింగ్‌కు దిగుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ ఐసీసీపై ఈ స్థాయిలో ఎందుకు మండిపడుతున్నారంటే.. తాజాగా అది చేసిన నిర్వాకమే కారణం. అంతర్జాతీయ క్రికెట్‌ను నియంత్రించే హోదాలో ఉన్న ఐసీసీ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ.. తాజాగా చేసిన ఒక పొరపాటు క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బుధవారం టీమ్ ర్యాకింగ్స్ ప్రకటించిన ఐసీసీ టెస్టుల్లో భారత్‌ను నంబర్ వన్‌గా ప్రకటించింది. 115 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉన్నట్లు సూచించింది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు జరిగిన తర్వాత ఈ ర్యాంకులు సవరించడంతో.. టీమిండియా నంబర్ వన్ ర్యాంకు చేరుకుందని అంతా భావించారు.
అంతకు ముందు భారత్.. టీ20, వన్డే ఫార్మాట్లలో నంబర్ వన్‌గా ఉండటంతో.. ఇప్పుడు టెస్టుల్లోనూ నంబర్ వన్ అయిందని, ఇలా మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ అయినా సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశాడు. చరిత్రలో తొలి సారి ఒక ఆసియా జట్టు మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా నిలిచిందని సంబురపడ్డారు. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సైతం క్రికెట్ అభిమానులు ఆకాశానికి ఎత్తేశారు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాను ఒకేసారి నంబర్ వన్‌గా నిలిపిన కెప్టెన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
గతంలో చాలా సార్లు ఇండియా వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్నా.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ కావడం తొలి సారి కావడంతో అంతా సంతోషించారు. కానీ.. తీరా 6 గంటలు గడవముందే.. టీమిండియా ర్యాంకు మారిపోయింది. మళ్లీ టెస్టుల్లో రెండో స్థానానికి పడిపోయింది. ఈ ఆరు గంటల గ్యాప్‌లో టెస్టు మ్యాచ్ జరగలేదు. మరి పాయింట్లలో ఎలాంటి మార్పు ఉండదు. మరి భారత్ ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్‌కు ఎలా పడిపోతుంది అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల టీమిండియా నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నట్లు సైట్ చూపించింది. ఈ విషయంలో ఐసీసీదే పూర్తి తప్పిదంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా.. గతంలోనూ ఒక సారి తప్పుగా ఇండియాను నంబర్ వన్ ర్యాంక్‌లో ఐసీసీ చూపించింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India’s dominance in world cricket! 🔥#CricTracker #INDvAUS #ICCRankings pic.twitter.com/NlUkv6GX3T
— CricTracker (@Cricketracker) February 15, 2023
An update on the No. 1 men’s teams in the ICC rankings
Test: 🇦🇺
ODI: 🇮🇳
T20I: 🇮🇳🔗 https://t.co/RrXVsjCw0o pic.twitter.com/8ukcOQTuXw
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2023