లక్నో వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగిపోయారు. స్పిన్నర్లు బాల్‌ను గింగిరాలు తిప్పుతుంటే.. ఇరు దేశాల బ్యాటర్లు వణికిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ.. పిచ్ కండీషన్స్ చూసి వారు తీసుకున్న నిర్ణయం ఎంతపెద్ద తప్పో వారికి అర్థమైంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తొలి ఓవర్‌లోనే న్యూజిలాండ్‌ను వణికించాడు. తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా వేయడమే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌తో పాటు పార్ట్‌టైమ్ బౌలర్ దీపక్ హుడా సైతం పండగ చేసుకున్నారు. తలో వికెట్ తీసుకున్నారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన అర్షదీప్ సింగ్ సైతం రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది.
టార్గెట్ చూసేందుకు స్వల్పంగానే ఉన్నా.. పిచ్, న్యూజిలాండ్ వద్ద ఉన్న క్వాలిటీ స్పిన్ చూస్తే.. మాత్రమే యంగ్ టీమిండియాకు సైతం ఈ టార్గెట్ ఛేజింగ్ అంత ఈజీ కాదని అనిపించింది. అనుకున్నట్లే.. మన బ్యాటర్లు సైతం కివీస్ స్పిన్‌కు వణికిపోయారు. సూర్యకుమార్ యాదవ్ లాంటి విధ్వంసకర బ్యాటర్ కూడా ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా కొట్టలేక కేవలం ఒక్క ఫోర్‌తో 31 బంతులు ఆడాడంటే.. న్యూజిలాండ్ బౌలర్లు భారత బ్యాటర్లను ఎంత కట్టడి చేశారో ఊహించుకోవచ్చు. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం 4 ఓవర్ల ఓటాను పూర్తి చేయడమే కాకుండా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడంటే.. పిచ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇలా న్యూజిలాండ్ స్పిన్నర్లు కట్టడి చేసినా.. భారత బ్యాటర్లు సింగిల్స్, డబుల్స్‌తో ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరుకున్నారు.
హార్దిక్ పాండ్యా ఓవర్ యాక్షన్..
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముక్కిములిగి గెలిచిన విషయం పక్కనపెడితే.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ అయిన తర్వాత పాండ్యా ఆట తగ్గి.. అతి పెరిగిపోయిందంటూ క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటే.. వారికి బౌలింగ్ ఇవ్వకుండా పాండ్యా అత్యుత్సాహం చూపించి 4 ఓవర్ల కోటా పూర్తి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అర్షదీప్ సింగ్ లాంటి ప్రధాన బౌలర్‌ను జట్టులో పెట్టుకుని పాండ్యా ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేయడం కూడా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అర్షదీప్ సింగ్ కంటే ఎక్కువ వేరియేషన్స్ ఉన్న బౌలర్ అయితే పాండ్యా కాదకదా అని అంటున్నారు. పైగా.. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే.. 2 ఓవర్లు వేసి 4 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్న చాహల్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వకుండా పాండ్యా 4 ఓవర్లు వేయడమే కాకుండా పార్ట్‌టైమ్ బౌలర్ దీపక్ హుడాకు 4 ఓవర్లు ఇవ్వడం కూడా చెత్త కెప్టెన్సీకి ప్రతిరూపంగా అనిపిస్తుందని అంటున్నారు.
4 ఓవర్లు వేసిన పాండ్యా 25 రన్స్ సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ పిచ్‌పై ఈ బౌలింగ్ గణాంకాలు మంచివే అయినా.. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన ఇలాంటి పిచ్‌పై ఇదో చెత్త బౌలింగ్ అనే చెప్పాలి. 2 ఓవర్స్‌లో ఒక మెయిడెన్ ఓవర్ వేయడమే కాకుండా వికెట్ తీసుకుని కేవలం 4 రన్స్ ఇచ్చిన చాహల్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పెషలిస్ట్ బౌలర్లుగా అర్షదీప్ సింగ్, శిమవ్ మావీలను జట్టులోకి తీసుకుని.. వారిద్దరికి కలిపి మొత్తం 3 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పేసర్లకు బౌలింగ్ ఇవ్వలేదు అనుకుంటే.. తాను మాత్రం నాలుగు ఓవర్లు పూర్తి చేసుకున్నాడు. టీమ్‌లో హార్దిక్ పాండ్యా ఒక ఆల్‌రౌండర్ అనే విషయం మర్చిపోయి.. టీమ్ ఫీల్డింగ్ చేస్తుంటే తానే నంబర్ వన్ బౌలర్‌గా, బ్యాటింగ్ చేస్తుంటే తానే నంబర్ వన్ బ్యాటర్‌గా ఫీలైపోతున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కెప్టెన్ అయితే.. తానే అన్ని చేసుకోవడం కాదని హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Grit, determination, and a lot of character 🇮🇳 pic.twitter.com/lq827ebAHy
— hardik pandya (@hardikpandya7) January 29, 2023