టీ20 వరల్డ్ కప్2022 ముందు టీమిండియా తన జోరు చూపిస్తోంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై టీ20 సిరీస్ లు నెగ్గి.. టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. అడుగు పెట్టీ పెట్టగానే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. తాజాగా వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయం సాధించినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ వైఫల్యం మళ్లీ ప్రపంచానికి తెలిసింది. 12 పరుగులకే 4 వికెట్లు నేలకూల్చిన భారత బౌలర్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది.. టీ20 వరల్డ్ కప్ గెలవడం భారత్ కు పెద్ద కష్టమేమి కాదు.. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. భారత జట్టు చూడడానికి బలిష్టంగానే కనిపిస్తోన్నప్పటికీ లోపల నుంచి బౌలింగ్ వైఫల్యం అనే క్యాన్సర్ పుండు టీమిండియాను కబళిస్తునే ఉంది. మరో సారి టీమిండియా బౌలింగ్ వైఫల్యం బయటపడింది. తాజాగా వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 13 పరుగుల తేడాతో నెగ్గింది. టీమిండియా గెలిచింది కదా? ఇంకేంటి సమస్య అని అనుకుంటున్నారా? గత కొన్ని సిరీస్ లలో టీమిండియా బౌలింగ్ దారుణంగా విఫలమవుతూ వస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో సైతం అది బయటపడింది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ తో భారత బౌలర్లను చీల్చిచండాడాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా, దీపక్ చాహర్ టీ20 వరల్డ్ కప్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వారి స్థానాల్ని భర్తీ చేసే బౌలర్ ఎవరా అని బీసీసీఐ సమాలోచనలు చేస్తూనే ఉంది. తాజాగా వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలింగ్ డొల్లతనం మరో సారి బయటపడింది.
ఈ క్రమంలోనే ప్రత్యర్థి జట్టును 12 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించిన భారత బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. ప్రత్యర్థి జట్టుకు గెలుపు అవకాశం ఇస్తూ.. ఏకంగా గెలుపు ముంగిట్లోకి ఆస్ట్రేలియా జట్టును తీసుకెళ్లారు. సూర్య కుమార్ మెరుపు ఇన్నింగ్స్ తో ఈ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లో 156 పరుగులు చేస్తే.. 12 పరుగులకు 4 వికెట్లు కోల్పొయిన వెస్ట్రర్న్ జట్టు చివరికి 20 ఓవర్లలో 145/8 పరుగులు చేసి 13 పరుగుల దూరం లో ఆగిపోయింది. భారత బౌలర్లల అర్షదీప్ ఒక్కడే 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లల చాహల్ 15/2, భువనేశ్వర్ కుమార్ 26/2 వికెట్లు నేలకూల్చారు. ఈ మ్యాచ్ లో అర్షదీప్ ఒక్కడే అద్బుతంగా రాణించాడు. అయితే ఒక్కడు రాణిస్తే గెలిచే ఆటకాదు క్రికెట్. సమష్టిగా జట్టులోని అందరు ఆటగాళ్లు రాణిస్తేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా విజయాలు సాధిస్తున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యం వెంటాడుతూనే ఉంది. బౌలింగ్ దళంపై భారత్ దృష్టి పెట్టకపోతే టీ20 వరల్డ్ కప్ లో కఠిన పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు అని క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ తీరు మారరా మీరు అంటూ.. క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
India won by 13 runs against Western Australia in the T20 World Cup warm-up match.#T20WorldCup2022 pic.twitter.com/eaLN3I6dlU
— CricTracker (@Cricketracker) October 10, 2022
Suryakumar Yadav and Arshdeep Singh shines as Team India defeat Western Australia by 13 runs.#T20WorldCup2022 #SuryakumarYadav #WesternAustralia #CricTracker pic.twitter.com/j7DreRtrBz
— CricTracker (@Cricketracker) October 10, 2022
Arshdeep Singh, Bhuvneshwar Kumar, and Yuzi Chahal were the pick of the bowlers for India in the warm-up game against Western Australia.#T20WorldCup2022 #ArshdeepSingh #WesternAustralia #CricTracker pic.twitter.com/Tt5Nj9lAPo
— CricTracker (@Cricketracker) October 10, 2022