టీ-20 వరల్డ్ కప్ లో మొదటి రెండు మ్యాచ్ లు చేజార్చుకున్న భారత్.. సెమీస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. ఇప్పటికే ఆప్గనిస్థాన్ పై సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. తాజాగా పసికూన స్కాట్లాండ్ పై పంజా విసిరింది. నెట్ రన్ రేట్ మెరుగు పరుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియా.. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జడేజా, షమీ, జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ తో స్కాట్లాండ్ కేవలం 85 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన ఇండియాకి శుభారంభం లభించింది. 42 బంతుల్లోనే లక్ష్య ఛేదన పూర్తి చేస్తే ఆఫ్ఘన్ కన్నా మెరుగైన రన్ రేట్ లభిస్తుందన్న తరుణంలో కే.ఎల్. రాహుల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు.
రాహుల్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టడం విశేషం. ఇక రోహిత్ కూడా తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించి, రాహుల్ కి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరి మెరుపు బ్యాటింగ్ కారణంగా టీమిండియా 6.3 ఓవర్లులోనే లక్ష్యాన్ని అధిగమించి, మెరుగైన రన్ రేట్ సాధించింది. ప్రస్తుతం టీమిండియా 1.619 రన్ రేట్ తో ఆఫ్ఘనిస్తాన్ కన్నా మెరుగైన స్థితిలో ఉంది. ఆదివారం జరిగే మ్యాచ్ లో గనుక… న్యూజిలాండ్ టీమ్ ని ఆఫ్ఘన్ ఒడిస్తే.. ఇండియా సెమీస్ కి చేరడం దాదాపు ఖాయం. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఆఫ్ఘన్ మన కన్నా మెరుగైన రన్ రేట్ సాధిస్తే.. ఎలాగో మనకి నమీబియాతో మ్యాచ్ ఉంటుంది కాబట్టి.. ఆ మ్యాచ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే సరిపోతుంది. మరి.. ఇన్ని క్యాలిక్యులేషన్స్ నడుమ.. ఇండియన్ క్రికెట్ టీమ్ సెమీస్ చేరుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
FIFTY in 1⃣8⃣ balls! 🔥 ⚡️
What a show @klrahul11 has put up in Dubai tonight! 👏 👏#TeamIndia #T20WorldCup #INDvSCO
Follow the match ▶️ https://t.co/cAzmUe5OJM pic.twitter.com/Fjxv3mJG1U
— BCCI (@BCCI) November 5, 2021