భారత్-వెస్టిండీస్ మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. అప్పటి వరకు రెండు జట్ల మధ్య దోబుచులాడిన విజయం చివరికి భారత్‌ను వరించింది. ఈ మ్యాచ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 వరకు జరగడంతో చాలా మంది ఈ మ్యాచ్ లైవ్‌ను చూడలేకపోయారు. కానీ.. స్టేడియంలో కూర్చోని చూస్తున్న టీమిండియా కోచ్, ఇతర ఆటగాళ్లు మాత్రం అసలు సిసలైన వన్డే క్రికెట్ మజాను ఆస్వాదించారు.
చివరికి ఎంతో గంభీరంగా ఉంటూ.. అన్ని విషయాలకు పెద్దగా భావోద్వేగానికి గురవ్వని రాహుల్ ద్రవిడ్ సైతం.. చివరి ఓవర్‌లో డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికొచ్చి స్టాండ్స్‌లో కూర్చున్నాడు. అతనితోపాటు టీమిండియా బెంచ్ ఆటగాళ్లు.. వెస్టిండీస్ ఆటగాళ్లు సైతం టెన్షన్ తట్టుకోలేక డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికొచ్చి కూర్చున్నారు. ఈ సమయంలో ద్రవిడ్ ఏదో విషయంలో ఎవరిపైనో కోపంగా అరుస్తూ.. అటు చూడమని చెప్తున్నాడు.
బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ మ్యాచ్‌లో యాక్షన్, ఎమోషన్స్ తక్కువేవి లేవు అంటూ ఒక వీడియోను పోస్టు చేసింది. అందులో ద్రవిడ్ టెన్షన్‌తో అరుస్తున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కని టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం ఫుల్ జోష్‌లో ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. పక్కనే విండీస్ ఆటగాళ్లు ఓటమి భారంతో డల్‌గా ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియోలో ద్రవిడ్ రియాక్షన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No shortage of action & emotions! 🔥 👌
🎥 Scenes as #TeamIndia seal a thrilling win in the first #WIvIND ODI in Trinidad 🔽 pic.twitter.com/rkpiPi3yOQ
— BCCI (@BCCI) July 23, 2022